Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Advertiesment
SS Rajamouli at Aparna cinemas

దేవీ

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (16:53 IST)
SS Rajamouli at Aparna cinemas
హైదరాబాద్ లోని నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం అయ్యారు. జులై 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా కోసం వచ్చారు. అక్కడ థియేటర్ లో కుటుంబంతో సహా ఆయన హాజరయ్యారు. రెగ్యులర్ గా ఆయన హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ కు వస్తుంటారు. కానీ కొంత కాలంగా ఆయన అక్కడకు రావడంలేదు. ఊరికి దూరంగా వుండే శేరిలింగంప‌ల్లి అపర్ణా సినిమాస్ కు వెళ్లడం మామూలైంది. 
 
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం ‘కింగ్డ‌మ్’.  శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని నల్లగండ్ల అపర్ణ మాల్‌లోని అప‌ర్ణ సినిమాస్‌లో ఆయ‌న మూవీని చూశారు. "కింగ్‌డమ్" చిత్రానికి బహిరంగంగా తన మద్దతును చూపించారు. ఆయన ఆ సినిమా ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. ప్రేక్షకుడిగా కూడా రాజమౌళి ఈ సినిమా గురించి పాజిటివ్ స్పందిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?