Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

Advertiesment
Rajamouli - junior pre release

దేవీ

, గురువారం, 17 జులై 2025 (07:44 IST)
Rajamouli - junior pre release
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
రాజమౌళి మాట్లాడుతూ, సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారు అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. చాలా పెద్ద సినిమా చేశారు. సినిమా 1000 + ప్లస్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్ కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్ కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను.

జెనీలియా అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారని నమ్మకం ఉంది. దేవి తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. సెంథిల్ గురించి చెప్పాలంటే సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమాకి తను బిగ్ ఎసెట్. పీటర్ క్రేజీ మ్యాన్. ఇంకా ఏదో బెటర్ గా చేయాలనే తపన తనలో ఉంటుంది. విపరీతంగా కష్టపడతాడు. పీటర్, సెంథిల్ ఇద్దరు కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్బుతున్నారంటే..  కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. పైసా వసూల్ మూవీ ఇది. అందరికీ థాంక్యు.'అన్నారు.  
 
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ,  కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాకి అద్భుతమైన మాటలు లిరిక్స్ రాశారు. శ్రీమణి కూడా ఇందులో మరో అద్భుతమైన పాట రాశారు. సెంథిల్ గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలో తీసిన కెమెరామెన్. అయితే ఒక కొత్త కుర్రోడుతో సినిమా చేస్తున్నప్పుడు కూడా అదే ప్యాషన్ తో వర్క్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. పీటర్ మాస్టారు చాలా అద్భుతమైన యాక్షన్ కంపోజ్ చేశారు. అల్లు అర్జున్ కి ఆర్య సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో కిరీటికి జూనియర్ సినిమా అలాంటి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'అన్నారు.
 
డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. రాజమౌళి గారితో మైల్ స్టోన్ మూవీస్ చేసిన అదృష్టం నాకు దొరికింది.  కిరీటి చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్. డాన్స్, పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఇంత డెడికేషన్ ఉన్న యాక్టర్ ని నా కెరియర్ లో చూడలేదు. కాళ్ల నుంచి రక్తం వస్తున్నా పర్ఫెక్షన్ కోసం 200 టేకులు చేసాడు. తప్పకుండా తను ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్