Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరలక్ష్మీ శరత్ కుమార్‌ చిత్రం శబరి తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ

Varalakshmi Sarathkumar

డీవీ

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (10:59 IST)
Varalakshmi Sarathkumar
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 
 
చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన 'వావ్' అనేలా ఉంటుంది. తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. అవుట్ పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా మాకు అంతలా నచ్చింది. మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి అయ్యాయి. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది'' అని చెప్పారు. 
 
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చియాన్ విక్రమ్ సినిమా తంగలాన్ నుంచి పార్వతీ తిరువోతు 'గంగమ్మ' క్యారెక్టర్