శరబరిమలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మకరజ్యోతి కనిపించింది. ఈ జ్యోతిని చూడగానే భక్తకోటి జనం ఆనందపారవశ్యంలో తరించిపోయారు. శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి. పొన్నాంబలమేడు కొండపై మూడుసార్లు మకర జ్యోతి కనిపించింది. ఈ జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు.
మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో నినాదాలు చేశారు. ఈ నామ స్మరణంతో శబరిమల క్షేత్రం మార్మోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్పస్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై నుంచి అయ్యప్పస్వామికి దేవతలు, ఋషులు హారతి ఇస్తారని ఈ క్షేత్ర పురాణం చెబుతుంది.