Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీరియడ్స్ ఆ రెండింటికి మంచిది.. మాట్లాడేందుకు భయమెందుకు?: ఉపాసన

Advertiesment
పీరియడ్స్ ఆ రెండింటికి మంచిది.. మాట్లాడేందుకు భయమెందుకు?: ఉపాసన
, గురువారం, 21 నవంబరు 2019 (10:47 IST)
కొణిదెల కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసమ మరో కీలక అంశంపై స్పందించారు. మహిళల రుతుస్రావంపై ఆమె స్పందించారు. సాధారణంగా.. పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళలు దాని గురించి మాట్లాడేందుకు భయపడతారు. 
 
అదేదో నిషిద్ధ పదం అన్నట్లు నామోషీగా ఫీల్ అవుతారు. కొందరైతే పీరియడ్స్ రాగానే.. ఎవ్వరికీ కనిపించకుండా, ఏం చెప్పకుండా దాస్తారు. అయితే.. ఇలా చేయడం ఎందుకని వారిని ఉపాసన ప్రశ్నించారు. పీరియడ్స్ అనేవి ఆరోగ్యానికి మంచివే. ఇంకా గర్భధారణకు మంచివేనని గుర్తు చేశారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను షేర్ చేసే ఉపాసన పీరియడ్స్‌ను సీక్రెట్‌గా దాచేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.  కొందరు ఇదంతా ఏదో చెడు అన్నట్లు భావిస్తారు. మలబద్ధకం, గ్యాస్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నపుడు దాని గురించి ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.
 
రుతుక్రమం అనేది సహజమైనదని, ఆరోగ్యానికి, గర్భం దాల్చేందుకు ఉపయోగపడేదని ఉపాసన వ్యాఖ్యానించారు. పీరియడ్స్ గురించి మాట్లాడగలిగితేనే దానికి తగిన పరిష్కారం లభిస్తుందని మహిళలకు ఉపాసన హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేక్ పువ్వుతో లవర్‌ను పడేశా