Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆమె'కు అమ్మాయిల పిచ్చి... వలపు వల విసిరి.. సెక్స్ టాయ్స్‌తో చిత్రహింసలు పెట్టి...

Advertiesment
'ఆమె'కు అమ్మాయిల పిచ్చి... వలపు వల విసిరి.. సెక్స్ టాయ్స్‌తో చిత్రహింసలు పెట్టి...
, శుక్రవారం, 8 నవంబరు 2019 (10:11 IST)
ఆమెకు చొక్కా ఫ్యాంటు ధరించడం ఇష్టం. పైగా, ఆమె గొంతు మగాళ్ళ మాదిరిగా ఉంటుంది. ఆమెలో ఉన్న ఈ మగ లక్షణాలే అడ్డుపెట్టుకుని అమ్మాయిలకు వలపు వల విసిరింది. ఇందులో చిక్కుకున్న అమ్మాయిలను ప్రేమపేరుతో దగ్గరకు చేరదీసి.. గదిలో బంధించి... సెక్స్ టాయ్స్‌తో చిత్ర హింసలు పెట్టేది. ఇందుకు ఆమె ప్రియుడు సైతం తనవంతు సహకారం అందించాడు. అలా ఆమె చేతిలో నరకం అనుభవించిన ఓ బాలిక తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బండారం బయటపడింది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక పోయిన ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మోసగత్తె కథనం ఒంగోలు జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒంగోలు జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంకు చెందిన సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి. కొన్ని నెలల క్రితం భర్తను వదిలివేసింది. ఆ తర్వాత ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మూడు నెలల క్రితం ఒంగోలు మారుతీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడ సిమ్‌కార్డులు విక్రయించే వంశీ అనే యువకుడికి సుమలత, ఏడుకొండలుతో పరిచయం ఏర్పడింది. 
 
సిమ్‌ కార్డుల కోసం వంశీ వద్దకు వచ్చే యువతుల ఫోన్‌ నంబర్లను సుమలతకు ఏడుకొండలు అందజేసేవాడు. సుమలత వారితో సాయితేజా రెడ్డి పేరుతో మాట్లాడి ట్రాప్‌ చేసేది. అమ్మాయిలపై సుమలతనే కాదు. ఏడుకొండలు, వంశీ కూడా అత్యాచారం చేసేవారు. పెళ్లికాని యువతులు, కాలేజీ విద్యార్థినులు, బాలికలను లక్ష్యంగా చేసుకొని సుమలత అకృత్యాలకు పాల్పడింది. సెక్స్ టాయ్స్‌తో చిత్ర హింసలు పెడుతూ తన కామవాంఛను తీర్చుకునేది. ఇంత జరిగినా బాధితులంతా అవమానభారంతో మిన్నకుండిపోయారు. 
 
ఈ క్రమంలో ఈనెల 2న జరుగుమల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లిన సుమలత, ఏడుకొండలు అక్కడి నుంచి ఓ బాలికను ఆటోలో ఒంగోలులోని తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆ బాలికకు అక్కడ రెండు రోజులపాటు సుమలత మత్తుమందు ఇచ్చి.. సెక్స్‌ టాయ్స్‌తో అత్యాచారం చేసింది. ఆ బాధిత బాలికే ఇటీవల 'స్పందన'లో జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుతో సుమలత బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
సుమలత కాకుండా, తనపై మరి కొంతమంది కూడా అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం సుమలత, వంశీని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుమలత ప్రియుడు ఏడుకొండలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఇంట్లో కొన్ని సెక్స్‌ టాయ్స్‌ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుంటుండగా, భయపడిన ఏడుకొండలు... భవనం చివరి అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాకు 'గంట' కొట్టేశారు... త్వరలో కాషాయ తీర్థం?