Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26 సీన్స్ కట్ చేయమని చెప్పలేదు.. పద్మావతి ఇక పద్మావత్: సీబీఎఫ్‌సీ

వివాదాస్పద బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్‌ బోర్డు యూ అండ్ ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెల్సింది. అలాగే సినిమా పేరును కూడా ‘పద్మావత్‌’గా మార్చాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించినట

26 సీన్స్ కట్ చేయమని చెప్పలేదు.. పద్మావతి ఇక పద్మావత్: సీబీఎఫ్‌సీ
, ఆదివారం, 31 డిశెంబరు 2017 (17:18 IST)
వివాదాస్పద బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్‌ బోర్డు యూ అండ్ ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెల్సింది. అలాగే సినిమా పేరును కూడా ‘పద్మావత్‌’గా మార్చాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం 27 సన్నివేశాలను కట్ చేయాలని కేంద్ర సెన్సార్ బోర్డు సూచించినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ విషయమై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడు వాణి త్రిపాఠి టిక్కో మండిపడ్డారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను సవరించమని చెప్పామే తప్ప, 26 సీన్స్ తీసేయాలని చెప్పలేదన్నారు. అంతేగాకుండా.. ఈ సినిమాను పద్మావత్‌గా మార్చమన్నామని.. ఈ సినిమాకు యూ అండ్ ఎ సర్టిఫికేట్ కూడా ఇచ్చామన్నారు. 
 
కాగా, 'పద్మావతి' చిత్ర వివాదంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్‌తో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. 16వ శతాబ్దానికి చెందిన మాలిక్ మహమ్మద్ రాసిన ''పద్మావత్'' కవిత ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించానని, ఈ చిత్ర నిర్మాణానికి రూ.150 కోట్ల వ్యయం చేసినట్టు ప్యానెల్‌తో భన్సాలీ వెల్లడించారు. కాగా ఈ సినిమాలో దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..