హీరో మాధవన్ వార్తల్లో నిలిచాడు. రాఖీ పండుగ సందర్భంగా తన తండ్రి, కొడుకుతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడం ద్వారా ఆయనపై మతవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? రాఖీ పండుగ సందర్భంగా మాధవన్ జంద్యంతో సంప్రదాయ హిందువులా కనిపించారు. కానీ ఆ ఫోటో వెనుక ఓ శిలువ వుండటాన్ని ఓ మహిళ తప్పుబట్టింది.
"మీ పూజ గదిలో శిలువ ఎందుకు ఉంది? మీరు మతం పరువు తీశారు. మీపై ఉన్న గౌరవం పోయింది. చర్చిల్లో హిందూ దేవుళ్లు కనిపించరు... కానీ హిందువైన మీ ఇంట్లో శిలువ ఉండటం నాకు నచ్చలేదు. మీరు హిందూ సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నారన్నది అబద్ధం. ఈ ఫొటో ఫేక్" అని జిక్సా అనే మహిళా నెటిజన్ ఫైర్ అయ్యింది.
ఇందుకు మాధవన్ ఘాటుగా బదులిచ్చాడు. ముందు మీకు పట్టిన రోగం త్వరలో నయం కావాలనుకుంటున్నానని చెప్పాడు. మీలాంటి వాళ్లు గౌరవించకపోయినా తనకు నష్టమూ లేదు. తనకు అన్ని మతాలూ సమానమే. అన్ని మతాల్నీ మా కుటుంబం విశ్వసిస్తుంది.
హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అని కాదు. ప్రతి మతానికి మా ఇంట్లో ప్రవేశం ఉంది. మీకు కనిపించలేదనుకుంటా.. ఆ ఫొటోలో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. గుడి, చర్చ్, దర్గా... దేనికైనా వెళ్లడం మంచి అవకాశంగా భావిస్తా. ఎందుకంటే నాకు మీకున్న జబ్బు నాకు లేదు" అంటూ ఆమెకు షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు.