టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వివాహం జరిగింది. నరేష్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పెళ్లి వీడియోను పంచుకున్నారు.
"మా ఈ కొత్త ప్రయాణంలో జీవితకాలం శాంతి, ఆనందం కోసం మీ ఆశీర్వాదాలను కోరుతున్నాను." అంటూ క్యాప్షన్ జోడించారు నరేష్. పవిత్రను నరేష్ పెళ్లి చేసుకుని దండలు మార్చుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
వారి వివాహ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో నరేష్ ప్రపోజల్, పెళ్లి ప్రకటన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే "ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముడ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్టూ పవిత్ర నరేశ్" అని ట్వీట్ చేశారు.