Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

Advertiesment
kishore, bramhi, gowtam

దేవి

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (12:36 IST)
kishore, bramhi, gowtam
పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. 
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ‘బ్రహ్మా ఆనందం’ ఓ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన ఓ యువ‌కుడు థియేట‌ర్ ఆర్టిస్ట్ కావాల‌నుకుంటాడు. దీని కోసం అత‌నికి కొంత డ‌బ్బు అవ‌సరం అవుతుంది. ఆ క్ర‌మంలో అత‌నికి ఓ ముస‌లి వ్య‌క్తి ప‌రిచ‌య‌మై, త‌న 6 ఏక‌రాల పొలం ఇచ్చేస్తానంటాడు. అయితే 10 రోజుల పాటు త‌న స్వార్థం కోసమే ఆలోచించ‌కుండా ప‌క్క‌నున్న వారి కోసం కూడా ఆలోచించాల‌నే కండీష‌న్ పెడ‌తాడు స‌ద‌రు ముస‌లి వ్య‌క్తి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే ‘బ్రహ్మా ఆనందం’ సినిమా.
 
ఓ వైపు డ‌బ్బులు అవ‌సర‌ముండి.. ముస‌లి వ్య‌క్తి చెప్పిన ప‌నులు చేసే కుర్రాడి పాత్ర‌లో రాజా గౌత‌మ్‌, .. అత‌న్ని ఇబ్బంది పెట్టే తాత పాత్ర‌లో బ్ర‌హ్మానందం ఒదిగిపోయారు. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌తో పాటు ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్ జ‌త చేసి.. చుట్టూ ఉన్న పాత్ర‌ల‌ను ఆక‌ట్టుకునేలా ద‌ర్శ‌కుడు ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకునే ఫ‌న్నీ రోల్‌లో మెప్పించ‌నుంటే, సంప‌త్ క్యారెక్ట‌రైజేష‌న్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక హీరో లైఫ్‌లో ల‌వ్ ట్రాక్ ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లారు మేక‌ర్స్‌.
 
బ్రహ్మా ఆనందం చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క వంటి చిత్రాల తరువాత నంది వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నారు.
 
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.
 
నటీనటులు : రాజా గౌతమ్, పద్మశ్రీ అవార్డ్ గ్ర‌హీత‌ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ