Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మానందం పాతపడిపోయాడు అందుకే కామెడీ రావడంలేదు

Advertiesment
Brahmanandam, Gowtam

డీవీ

, గురువారం, 16 జనవరి 2025 (17:25 IST)
Brahmanandam, Gowtam
సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి తెలిసిందే. హీరోలు కూడా ఓ దశలో ఆయన డేట్స్ కోసం షూటింగ్ లు మార్చుకున్న సందర్భాలున్నాయి. అదంతా గతం వర్తమానంలో ఆయన కామెడీ పండడంలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇవి ఆయన చెవిన సోకాయి కూడా. దీనిపై ఆయన ఇలా వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన బ్రహ్మానందం అనే పేరుతో సినిమా చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ఇదివరికిటిలా కాకుండా సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నారు. ఎందుకు అంటే.. ఈ విధంగా చెప్పారు.
 
నాకు అందమైన షాండిలియర్ ఇమేజ్ వుంది. దాన్ని శుభ్రం చేసి నీట్ గా చూసుకోవడం వేరు. దాన్ని వదిలేస్తే దుమ్మపట్టి బూజు కూడా పడుతుంది. అందుకే రోజూ జాగ్రత్తగా చూసుకుంటూ బాగుండేలా చూసుకోవాలి. అందుకే షాండిలియర్ లా వుండాలనుకుంటున్నా. కంటెన్యూగా సినిమాలు చేస్తే చిన్న ప్రాబ్లమ్ వుంది. ఒకప్పటిలా స్పీడ్ గా సినిమాలు చేయలేను. అందుకు ఆరోగ్యం సహకరించదు. ఏదైనా సినిమాలో చేస్తే, ఇంతకుముందు బ్రహ్మానందం కామెడీ బాగుండేది.  ఇప్పుడు చేస్తున్నారు కానీ నవ్వురావడంలేదని ఇంతకుముందు నాతో చేసిన కమేడియన్లు అంటుంటే విన్నాను. ఎంత చేసిన ఇంకా ఏదో కావాలని వెతుకుతున్నారు. 
 
అందుకే సెలక్టివ్ గా చేస్తున్నారు. ఆ ట్రెండ్ నుంచి దూరంగా వుండాలని రంగ మార్తాండ చేశాను. అందులో ఏడిపించాను. మరలా నవ్వించాలంటే నా వయస్సు కూడా సహకరించాలి. ఇదివరలా స్పీడ్ గా చేసుకుంటూ పోలేను. ప్రస్తుతం మా అబ్బాయితో బ్రహ్మానందం సినిమా చేశాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్ కమ్ముల గోదావరి చిత్రం మొదట గౌతమ్ కు వస్తే వద్దనుకున్నాడు