Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

Advertiesment
Mytry movie Naveen Erneni

దేవీ

, గురువారం, 7 ఆగస్టు 2025 (15:16 IST)
Mytry movie Naveen Erneni
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్ కు చెందిన కొంతమంది కార్మికులు తమకు నిర్మాతలు తమ వేతనం పెంపులో 30 శాతం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై 24 క్రాఫ్ట్ కు చెందిన కార్మిక ఫెడరేషన్ సంఘ నాయకులు వల్లభనేని అనిల్ ఆద్వర్యంలోనూ మరోవైపు ఫిలింఛాంబర్ కమిటీ, లేబర్ ఆపీసర్ కూడా మీటింగ్ వేశారు. ఈ సందర్భంగా మొన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సి.కళ్యాణ్ కమిటీ త్వరలో కార్మికుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్టేట్ మెంట్ ఇచ్చారు.
 
కాగా, రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో అగ్రనిర్మాత మైత్రీమూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని గొప్ప స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితి లో వేతనాలు పెంచే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఇండస్ట్రీ లో సినిమా లకు రిటర్న్స్ బాగా తగ్గాయి. సినిమాలను చూడడానికి థియేటర్లలో ప్రేక్షకులు రావడంలేదు. సినిమా థియేటర్లలో విడుదలకావాలంటే ఓటీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన దారుణ పరిస్థతి వచ్చింది.  OTT. బిజినెస్ లు లేవు. కార్మికల నాయకులు, కార్మికులు ఆలోచించుకోవాలని మైత్రి నవీన్ చెప్పారు.
 
పెద్ద సినిమా కార్మికులకు పెంపుదల వర్తిస్తుంది
ఇదిలా వుండగా, ఏడాదికి పది సినిమాలు పెద్దవి జరుగుతుంటాయి. రెండేళ్ళు, మూడేళ్ళు ఐదేళ్ళు షూటింగ్ లు జరుగుతుంటాయి. అందులో పనిచేసేవారికి తప్పిని సరి పెంపు దల చేయాల్సి వస్తుందనీ, లేదంటే వారంతా బాలీవుడ్, తమిళనాడు నుంచి అసిస్టెంట్లను తెచ్చుకుంటామని టెక్నీషియన్లు గట్టిగా చెబుతున్నారు. దీనిపై సినీ పెద్దలకు విన్నవించినా వారు చేసింది ఏమీ లేదు. ఇక్కడ పెద్ద మాఫియానే కొనసాగుతుందని... పీపుల్స్ మీడియా అదినేత విశ్వప్రసాద్ తెలియజేస్తున్నారు.

అంతేకాక చిన్న నిర్మాతలకు ఈ పెంపుదల వర్తించదు. వారికి 30 శాతం పెంచాల్సిన అవసరం లేదు. చిన్న నిర్మాతలు తమకు ఇష్టమైన పనివాళ్ళను తీసుకునే హక్కువుందని ఈరోజు జరిగిన ఛాంబర్ సమావేశంలో తీర్మానం చేశారు.
 
కార్మికుల కోసం పెడరేషన్ ప్రెసిడెంట్ చండీయాగం ?
కార్మికుల శాఖ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నిన్న ఓ ప్రకటన చేశారు. కార్మికుల కోసం తానొక చండీ యాగం  చేస్తున్నాననీ, అది కూడా  చిత్రపురి కాలనీలోని పాత కార్యాలయంలో జరుగుతుందని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. చంఢీ యాగం అంటే వ్యక్తిగతం జరుపుకునేది. కానీ ఈయనగారు కార్మికులందరి కోసం అంటూ ప్రకటనలు  చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని చిత్రపురి పోరాట కమిటీ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. 
 
కార్మికులను పావుగా ఉపయోగించుకుంటున్నారా !
ఫెడరేషన్ ఎన్నికలు గత ఆరునెలలుగా జరపలేదు. పైగా ఫిలింఛాంబర్ ఎన్నికలు కూడా జరగాల్సి వుంది. కానీ ఇరు అసోసియేషన్ల కాలపరిమితికి కాలం చెల్లింది. కానీ పాత కమిటీవారే తమ స్వలాభం కోసం తమకు అనుకూలమైన కార్మికులను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...