Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్ లో డిసెంబరు 5న ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభం

వైజాగ్ లో డిసెంబరు 5న ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభం
, బుధవారం, 1 డిశెంబరు 2021 (16:54 IST)
Mugda store sashi
టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌  ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం. ఇప్పుడు మన వైజాగ్ జగదాంబ సెంటర్ మరియు సంపత్ వినాయక రోడ్ లో నూత‌న షోరూమ్ ప్రారంభంకాబోతోంది. ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం ప‌లుకుతోంది.
టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  వైజాగ్  నగర వాసులకు  డిసెంబరు 5న  దగ్గర కానున్నారు.  ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ, వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను  అందుబాటులోకి తెస్తున్నారు.
 
ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ, వైజాగ్  నా అభిమాన నగరాల్లో ఒకటి. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు   ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు. ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల.  ఈ నగరంలో  ముగ్ధ స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
 
టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌ అనేది శశివంగపల్లి ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం. అన్ని విషయాల్లోనూ దేశంలోనే అత్యంత వినూత్నమైన స్టోర్‌ ఇది. కస్టమర్లకు ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతిని అందించే ఈ స్టోర్‌ ఇప్పుడు  వైజాగ్ నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.  
- ఈ డిసెంబరు 5న ప్రారంభించనున్నారు. ‘‘మా దగ్గర ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్స్‌ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కి అందుబాటు ధరలలొనే   అందిస్తాం. ఎల్లప్పుడూ మేం నాణ్యతపైనే దృష్టి సారిస్తాం. డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తాం’’అని స్టోర్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ స్టోర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్యాషన్‌ ప్రియులు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా టిక్కెట్ల ధరలు ప్రకటించిన ఏపీ సర్కారు... కనిష్టంగా రూ.5