Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

Advertiesment
Pranaya Godari team

డీవీ

, సోమవారం, 16 డిశెంబరు 2024 (10:46 IST)
Pranaya Godari team
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ అయింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్ చెప్పేందుకు ప్రణయగోదారి టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
 
 దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థాంక్స్.  సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ టీంను అభినందించారు. విజువల్స్, పాటలు ఇలా ప్రతీ దాని గురించి మాట్లాడారు. కొత్త టీం అయినా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ విని మాకు చాలా ఆనందమేసింది. ప్రేక్షకులు బాగానే ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
 హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సదన్ సెట్‌లో మా అందరినీ నవ్విస్తూ ఉంటారు. సాయి కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’అని అన్నారు
 
 సంగీత దర్శకుడు మార్కండేయ మాట్లాడుతూ.. ‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారు. మా సినిమా జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ముఖ్య పాత్రను పోషించింది. నేను ఇచ్చిన పాటలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
 
 నటుడు సునీల్ రావినూతల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా రోజుల తరువాత అందమైన ప్రేమ కథా చిత్రాన్ని చూశామని అంటున్నారు. కథకు తగ్గ విజువల్స్, పాటలు ఉన్నాయని అన్నారు. మార్కండేయ గారి పాటల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
 
 నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి చిత్రాన్ని ఆడియెన్స్ ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా ఇంకా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 కెమెరామెన్ ప్రసాద్ ఈదర మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి చిత్రానికి కెమెరామెన్‌గా పని చేసినందుకు ఆనందంగా ఉంది. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?