Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిక మందన్న బర్త్ డే ట్రీట్.. విజయ్‌తో రొమాన్స్.. షూటింగ్ ఫోటోలు

Advertiesment
Vijay _Rashmika
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (14:15 IST)
Vijay _Rashmika
కన్నడ అందం రష్మిక మందన్న పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. తెలుగు సినిమాలతో పాటు రష్మిక మందన్న హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. 
 
హిందీలో రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న "మిషన్ మజ్ను" సినిమాతో  అరంగేట్రం చేయనుంది.  తాజాగా మరో హిందీ సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తోంది. 


webdunia
Vijay _Rashmika
 
హిందీ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు సందీప్ వంగ దర్శకుడు. యానిమల్ పేరుతో వస్తోంది. దీనికి సంబంధించి ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన విడుదలైంది. సందీప్ తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ఆయన హిందీలో "కబీర్ సింగ్" మరొక హిట్ అందుకున్నారు.
  
రష్మిక బయోగ్రఫీ
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. 
ష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక  ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. 


webdunia
 








రష్మిక మందన్న తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా.'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది
 
కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. 
 
ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది.  


webdunia
Vijay _Rashmika
 
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఇక రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. శర్వానంద్ హీరోగా చేశారు. తాజాగా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సరసన నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకుంది.
 
విజయ్‌తో రష్మిక మందన్నా జోడి కట్టబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేసింది యూనిట్‌. విజయ్- రష్మిక మందన్న, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది. ఈ సినిమా షూటింగ్ వసంత పంచమి అయిన ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

విజయ్‌తో తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి రూపొందిస్తున్న  తెలుగు, తమిళం బైలింగ్వల్‌ మూవీ `vijay 66` లో రష్మిక మందన్నాని హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఆమెని ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఈ సినిమాతో విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటంగ్ లాంఛనంగా ప్రారంభమైంది. 
webdunia
Vijay _Rashmika
 
మరో తెలుగు కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా వచ్చింది. `మహానటి` ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. 

webdunia
Vijay _Rashmika




ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికనే హీరోయిన్‌గా ఖరారు చేశారు. వార్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దుల్కర్‌కి జోడీగా అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్నా నటించబోతుంది. తాజాగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. రష్మిక లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన థియేటర్ యజమానులు