Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

Advertiesment
adi srinivas

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (14:05 IST)
ఫార్ములా ఈ-కార్ రేస్‌ నిర్వహణ కోసం నిధుల మళ్లింపు కేసులో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ-కార్ రేస్ నిధుల మళ్లింపు అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ వద్ద విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని భారాస నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బును కూడా చేరవేశారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేసమయంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ