Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికన్ టీవీ సిరీస్ డ్యూన్: ప్రాఫెసీలో అందాల నటి టబు..

Tabu

సెల్వి

, మంగళవారం, 14 మే 2024 (13:27 IST)
బాలీవుడ్ నటి టబు ప్రతిష్టాత్మక డ్యూన్ వెబ్ సిరీస్ నటించే ఛాన్స్ కొట్టేసింది. తద్వారా ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ డ్యూన్: ప్రాఫెసీలో నటించబోతోంది. ఈ సిరీస్‌లో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో కనిపించనుంది. డ్యూన్: ప్రాఫెసీ అనేది ఓ అమెరికన్ టీవీ సిరీస్. ఇందులో బాలీవుడ్ నటి టబు కీలకమైన పాత్రలో నటిస్తోంది. బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్ర ప్రేక్షకులపై ఓ బలమైన ముద్ర వేస్తుంది.
 
ప్రముఖ రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన డ్యూన్ ప్రపంచంలోనే ఈ సిరీస్ ను కూడా నిర్మిస్తున్నారు. మనిషి మనుగడకు ముప్పు తెస్తున్న శక్తులతో హర్కోనెన్ సిస్టర్స్ పోరాడే నేపథ్యంలో ఈ డ్యూన్: ప్రాఫెసీ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ డ్యూన్ సిరీస్ బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జే ఆండర్సన్ రాసిన సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలీవుడ్‌లో విడిపోయిన మరో ప్రేమ జంట... జీవీ ప్రకాష్ - సైంధవి విడాకులు