Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

breast cancer awareness

ఐవీఆర్

, బుధవారం, 24 ఏప్రియల్ 2024 (16:37 IST)
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల, ఏఓఐ ఒక వినూత్నమైన అనస్తీషియా(మత్తు) పద్ధతిని ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ ఉన్న ముగ్గురు హై-రిస్క్ రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది, ఇది క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
యాక్సిలరీ డిసెక్షన్‌తో మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ(MRM) అనేది రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఒక ప్రామాణిక శస్త్రచికిత్సా విధానం, జనరల్  అనస్థీషియా కింద సాధారణంగా ఈ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD), కార్డియోమయోపతి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి తీవ్రమైన కోమోర్బిడిటీలు ఉన్న రోగులు జనరల్ అనస్థీషియాతో హై-రిస్క్ ఎదుర్కొంటారు.
 
ఈ సవాలుకు ప్రతిస్పందనగా, విజయవాడలోని AOI, మంగళగిరి, పారావెర్టెబ్రల్ బ్లాక్(PVB)తో పాటు పెక్టోరల్ నెర్వ్స్(PECS) బ్లాక్‌ను ప్రాథమిక మత్తు టెక్నిక్‌గా ఉపయోగించడం ద్వారా మార్గదర్శక విధానాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న పద్ధతి జనరల్ అనస్థీషియాతో సంబంధం ఉన్న ప్రమాదాలు లేకుండా MRM శస్త్రచికిత్సను సురక్షితంగా, విజయవంతంగా చేయించుకోవడానికి రోగులను అనుమతిస్తుంది. 
 
AOI వద్ద సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు మాట్లాడుతూ, కొమొర్బిడిటీలతో బాధపడుతూ, రొమ్ము క్యాన్సర్ ఉన్న రోగులకు చికిత్స చేయడం ప్రత్యేకమైన సవాళ్లను అందిస్తుంది. రోగి భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటుగా వీలైనంత అత్యుత్తమ చికిత్స అందించటం తమ లక్ష్యమన్నారు. చికిత్స పొందిన రోగులలో శ్రీమతి V.L(67 సంవత్సరాలు), శ్రీమతి J.B (74 సంవత్సరాలు), శ్రీమతి P.S (83 సంవత్సరాలు) ఉన్నారు, వీరందరూ తమకున్న కోమోర్బిడిటీల కారణంగా జనరల్ అనస్థీషియా వల్ల ప్రమాదం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు రోగులు ఎటువంటి సమస్యలు లేకుండా MRM శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు.
 
AOI కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, పారావెర్టెబ్రల్ బ్లాక్ (అల్ట్రాసౌండ్ మార్గదర్శకత్వంతో) వెన్నెముక నరాల దగ్గర లోకల్ అనస్తీషియా అందించడం ద్వారా సోమాటిక్, సింపాథటిక్ నెర్వ్స్ ఆదుకోవడం జరుగుతుంది. ఈ సాంకేతికత వల్ల ప్రతికూల ప్రభావాలకు చాలా తక్కువ సంభావ్యత ఉంటుంది, ఇది హై-రిస్క్ ఉన్న రోగులకు సురక్షితమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది. పారావెర్టెబ్రల్, PECS బ్లాక్‌లను వినియోగించటం ద్వారా, మేము ప్రతి రోగి యొక్క వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మత్తుమందు విధానాన్ని రూపొందించగలిగాము, ఫలితంగా విజయవంతమైన శస్త్రచికిత్స ఫలితాలు వచ్చాయి" అని అన్నారు. 
 
AOI, విజయవాడ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO) మహేందర్ రెడ్డి, ఆసుపత్రి సాధించిన విజయం పట్ల తన సంతోషం వ్యక్తం చేస్తూ, "AOI వద్ద, క్యాన్సర్ సంరక్షణ యొక్క సరిహద్దులను అధిగమించటానికి, రోగులకు ఫలితాలను మెరుగుపరచడానికి వినూత్న పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ అధిక-ప్రమాదం ఉన్న రొమ్ము క్యాన్సర్ రోగుల చికిత్స, శ్రేష్ఠత పట్ల మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. ఆంకాలజీ సంరక్షణలో అగ్రగామిగా మా స్థానాన్ని బలోపేతం చేస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?