Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఉపయోగించి AV మాల్ఫార్మేషన్‌కి అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

rare brain infection

ఐవీఆర్

, గురువారం, 28 మార్చి 2024 (22:48 IST)
మెదడులోని ఎడమ ఫ్రంటల్ లోబ్‌లో ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM)తో బాధపడుతున్న 52 ఏళ్ల పురుషునికి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), మంగళగిరి విజయవంతంగా చికిత్స అందించింది. అసాధారణంగా రక్త నాళాలు చిక్కుముడి పడటాన్ని AV వైకల్యంగా పేర్కొంటారు. అత్యాధునిక న్యూరో ఆంకాలజికల్ చికిత్సావకాశాలలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన అత్యాధునిక  హాల్సియాన్ సిస్టమ్‌ని ఉపయోగించి రోగి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS) చేయించుకున్నాడు.
 
మెదడులోని AV వైకల్యాలు కారణంగా రక్తస్రావం, మూర్ఛలు, నాడీ సంబంధిత సమస్యలతో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. సాంప్రదాయ పరంగా చూస్తే , AV వైకల్యాలకు చికిత్స ఎంపికలలో శస్త్రచికిత్స, ఎంబోలైజేషన్ లేదా స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ కనిపిస్తాయి.  అయినప్పటికీ, SRS అనేది నాన్-ఇన్వాసివ్ ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది, ఇది చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టాన్ని తగ్గిస్తూనే,  లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి ఖచ్చితమైన రేడియేషన్ థెరపీని అందిస్తుంది. AOI, విజయవాడలోని రేడియేషన్ ఆంకాలజిస్ట్‌ల నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం కస్టమైజ్డ్ చికిత్స ప్రణాళికను రూపొందించింది. హాల్సియాన్ సిస్టమ్ యొక్క అధునాతన సామర్థ్యాలను ఉపయోగించి, చికిత్సను  ఒకే లక్ష్యంతో చేసింది.
 
AOI విజయవాడలోని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ మణికుమార్ మాట్లాడుతూ, "AV వైకల్యాల చికిత్స కోసం SRS ఉపయోగించి విజయవంతమైన ఫలితాలను సాధించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ విధానం రోగులకు అద్భుతమైన ఖచ్చితత్వం, సమర్థతతో, తక్కువ ఇన్వాసివ్ చికిత్స ఎంపికను అందిస్తుంది, చివరికి వారి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది." అని అన్నారు. SRS చికిత్స పూర్తయిన తర్వాత, చికిత్స ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి, సరైన ఫలితాలను నిర్ధారించడానికి రోగిని రెగ్యులర్ ఫాలో-అప్ షెడ్యూల్‌లో ఉంచారు. చికిత్స అనంతర పరీక్షలు రోగి నివేదించిన అతి తక్కువ దుష్ప్రభావాలతో, AV వైకల్యం యొక్క విజయవంతమైన చికిత్సను సూచిస్తాయి, 
 
AOI విజయవాడ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ఆర్టిరియోవీనస్ మాల్ఫార్మేషన్(AVM)తో ఉన్న ఈ రోగికి విజయవంతమైన చికిత్స మా సంస్థకు గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. ఇది అత్యాధునిక సాంకేతికతను, మా రోగులకు అత్యున్నత స్థాయి సంరక్షణ నైపుణ్యాన్ని అందించడంలో మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. మా మల్టీడిసిప్లినరీ బృందం యొక్క ప్రయత్నాలకు, రోగి ఫలితాలను మెరుగుపరచడంలో వారి నిబద్ధతకు మేము గర్విస్తున్నాము" అని అన్నారు. 
 
ఈ రోగి యొక్క విజయవంతమైన చికిత్స, నూతనత్వం, సహకారం ద్వారా రోగి సంరక్షణను అభివృద్ధి చేయడంలో AOI యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. సంక్లిష్ట న్యూరో ఆంకాలజికల్ సంబంధిత పరిస్థితులు ఉన్న రోగులకు అత్యాధునిక చికిత్సలు, వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడానికి AOI అంకితం చేయబడింది. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), విజయవాడలోని క్యాన్సర్‌ చికిత్స కు అత్యుత్తమ ఆసుపత్రి మంగళగిరిలోని NRI హాస్పిటల్‌లో పూర్తి స్థాయి సౌకర్యాన్ని నిర్వహిస్తోంది. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ భారతదేశం మరియు దక్షిణాసియాలో సూపర్- న్యూరో ఆంకాలజికల్ క్యాన్సర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?