సినీ నటి తాప్సీ తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. పాఠశాల వయసులోనే ప్రేమలో పడ్డాడని, అది అపుడే బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది. కానీ ఇపుడు మాత్రం ఎవరితోనూ ప్రేమలో పడలేదని తెలిపింది.
అయితే, తన ప్రేమ బ్రేకప్ కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ, నేను 9వ తరగతిలోనే ఉన్న సమయంలో ప్రేమలోపడ్డాను పదో తరగతిలో పబ్లిక్ పరీక్షలు రాస్తున్న సమయంలో నేను ప్రేమించిన అబ్బాయి వదిలేశాడు అని చెప్పింది.
అపుడు ఏం చేయాలో తోచలేదు. పైగా, ఆ సమయంలో ఫోన్లు, గట్రాలు లేవు. అందుకే ఇంటి వెనుక ఉండే పబ్లిక్ ఫోన్‌బూతుకు వెళ్లి ప్రేమించిన యువకుడికి ఫోన్ చేసి నన్ను ఎందుకు వదిలివేశావ్ అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ప్రశ్నించేదాన్ని అని తెలిపింది. ఇపుడు ఆ నాటి సంఘటనలను తలచుకుంటే తనకు నవ్వు వస్తోందని ఆమె చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఇప్పటివరకు ప్రేమలో పడలేదని తెలిపింది. ముఖ్యంగా, తన ఆలోచనలకు తగినట్టుగా ఉండే వ్యక్తి దొరకాలని తెలిపింది. తాను ప్రేమించే వ్యక్తితో అభిప్రాయాలు కలవాలని తాను ప్రేమలో ఉన్నపుడు ఆ విషయాన్ని అందరికీ చెప్పేస్తానని వెల్లడించింది.