Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ నేతను సీక్రెట్‌గా వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్...

swara bhaskar
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (08:23 IST)
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అయిన సమాజ్ వాదీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడు ఫహద్ అహ్మద్‌ను ఆమె మనువాడారారు. ఈ వివాహం ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది స్నేహితుల సమక్షంలో జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఈ నెల 16వ తేదీన సోషల్ మీడియాలో షేర్ చేసి తన వివాహాన్ని అధికారికంగా వెల్లడించారు. 
 
అలాగే, తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన తమ ప్రయాణాన్ని ఆమె షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత జనవరి 6వ తేదీన వీరిద్దరూ తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రేమను వెతికినపుడు మొదట స్నేహం ఎదురవుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఒకరినొకరు తెలుసుకున్నాం. చివరగా నాకు ప్రేమ లభించింది. వెల్ కమ్ టూ మై హార్ట్ ఫహద్ అంటూ రాసుకొచ్చుంది. 
 
కాగా, బాలీవుడ్ నటీమణుల్లో తమ భావాలను ధైర్యంగా వ్యక్తపరిచే హీరోయిన్లలో స్వర భాస్కర్ ఒకరు. ఇప్పటికే తాను చెప్పదలచిన అనేక విషయాలను ఆమె ట్విట్టర్ వేదికగా పలుమార్లు వ్యక్తపరిచారు. ముఖ్యంగా, 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఆమె ఒకరు. ఆ తర్వాత ఆమె పలు ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఫహద్ అహ్మద్ ఆమెకు పరిచయమయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపక్ సరోజ్ హీరోగా మరో అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధార్థ్ రాయ్ ఉంటుందా?