Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్

Advertiesment
siya gautham
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (08:42 IST)
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోయిన్ శియా గౌతమ్ పెళ్లి పీటలెక్కింది. ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను ఆమె పెళ్లి చేసుకున్నారు. గత 2008 రవితేజ హీరోగా వచ్చిన చిత్రం "నేనింతే". ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో హీరోయిన్ శియా గౌతమ్‌కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఈక్రమంలో ముంబైకు చెందిన మిఖాయిలో ఫాల్కీవాలతో ప్రేమలోపడిన ఈమె... తాజాగా అతన్ని పెళ్లాడింది. 
 
ఈ విషయం కూడా ఆమె తొలుత వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఓ వార్త రావడంతో ఆతర్వాత ఆమె తన పెళ్లి విషయంపై ఓ పోస్టు ద్వారా వెల్లడించింది. అయితే, వీరి పెళ్లి ఎక్కడ జరిగిందన్న వివరాలను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. పెళ్ళి ఎలా జరిగిందన్న వివరాలతో మాత్రం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో శియా, ఫాల్కీవాలా జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది : నందమూరి బాలకృష్ణ