Sivaraj Kumar, Nandamuri Balakrishna, Geeta Siva Rajkumar and others
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివ రాజ్‌కుమార్ 125 వ చిత్రం శివ వేద. ఈ చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగులో ఫిబ్రవరి 9 నా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు ముఖ్య అతిధిగా వచ్చి ఈ సినిమా బిగ్ టికెట్ ను లాంచ్ చేసి చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు. అనంతరం
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. గీతా పిక్టర్స్, జీ స్టూడియో నిర్మాణం లో వస్తున్న "వేద" చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు హర్ష ఇంతకుముందు శివరాజ్ ఫ్యామిలీ తో నాలుగు సినిమా తీశాడు. బజరంగి 1, 2,, పునీత్ తో అంజనీ పుత్ర, వంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు వస్తున్న ఈ వేద సినిమాను కూడ చాలా బాగా తీశాడు . అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో నాకు ఎప్పటినుండో అనుబంధం ఉంది. వీరు ముగ్గురు అన్నదమ్ములు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్.. పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడు.పునీత్ శారీరకంగా మన మధ్య లేకపోయినా తను చేసిన పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుతాయు. వేద సినిమకు వచ్చే సరికి డైరెక్టర్ చాలా బాగా చూయించాడు. సినిమాటో గ్రాఫర్ విజువల్స్ బాగున్నాయి. ఒక సినిమాను హిట్ చేయాలన్నా , ఫట్ చేయాలన్నా, మ్యూజిక్ డైరెక్టర్ , ఎడిటర్ మరియు టెక్నిషియన్స్ చేతిలో ఉంటుంది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ చాలా బాగా చేశాడు. ఇందులో చాలా మంది సీనియర్ నటులు నటించారు. కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ... మా శివ వేధ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మా బ్రదర్ బాలకృష్ణ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. వారు తన 100 వ సినిమా శాతకర్ణి సినిమా లో ఒక సాంగ్ చేయమని అడిగారు చాలా సంతోషం వేసి చేయడం జరిగింది. అయితే తనతో .నాకు ఒక సాంగ్ కాదు ఫుల్ లెన్త్ కారెక్టర్ ఉన్న సినిమా చేయాలని ఉంది.ఆ సినిమా కొరకు వెయిట్ చేస్తున్నాను. బాలయ్య గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే ఎన్టీఆర్ రామారావు గారు, నాగేశ్వరావు గారు శివాజీ గణేషన్, ఎంజీఆర్ గారు ఇలా అందరూ బ్రదర్ లాగా ఉండే వాళ్ళు వారు ప్రతి సినిమాను వాళ్లు షేర్ చేసుకునే వారు. సౌత్ ఇండియా సినిమా ఆలా అప్పటి నుండి చాలా ఫ్రెండ్లీ గా ఉంది. అలాగే నెక్స్ట్ టైం నుంచి నేను చేసే అన్ని సినిమా లను తెలుగులో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాము.నా భార్య గీతా శివరాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ ఉంది.చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫీల్ అవుతారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అన్ని ఈ సినిమా బాగా నచ్చుతుంది ఫిబ్రవరి 9న వస్తున్న ఈ సినిమాలో అందరూ కచ్చితంగా వస్తుంది
గీతా పిక్చర్స్ అధినేత గీత మాట్లాడుతూ. మా సినిమా ఫంక్షన్కి బాలయ్య గారు రావడం చాలా సంతోషంగా ఉంది
మేము దుఃఖంలో ఉన్నప్పుడు బాలయ్య గారు మాకు అండగా నిలబడ్డారు. అందుకు వారికి ధన్యవాదములు.మా శివ వేధ సినిమా కన్నడలో విడుదలై బిగ్ హిట్ అయింది.అక్కడ అంత హిట్ అయిందంటే దానికి దర్శకుడు హర్ష గారే కారణం. ఇందులో నటీ నటులు అందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాలో కూడా సక్సెస్ అవుతుంది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చిత్ర దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. నేను శివన్న గారికి గీత మేడమ్ కి ఫస్ట్ గా థాంక్స్ చెప్పాలి. వారి 125 వ సినిమాకు గీత ప్రొడక్షన్ నుంచి ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ఇంత ఎమోషనల్ గా వచ్చిందంటే దానికి టీం, టెక్నీషియన్స్ స్టార్ క్యాస్ట్ ఇలా చాలామంది ఉన్నారు మీరందరూ హార్డ్ వర్క్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. మా సినిమాను కృష్ణ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది ఆయనకు మా ధన్యవాదాలు. మా శివ వేధ సినిమాలో ఎమోషనల్ డ్రామా, యాక్షన్,థ్రిల్లర్ గా కూడా ఉంటుంది ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.కర్ణాటకలో మా సినిమాలు ఎమోషనల్ హిట్ అవ్వడమే కాకుండా లేడీస్ అందరు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ సినిమాను కూడా బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత యం వి ఆర్ క్రిష్ణ మాట్లాడుతూ..కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను శివరాజ్ కుమార్ సహాయంతో జీ స్టూడియో వాళ్లని సంప్రదించి తెలుగు ప్రేక్షకులు అందించాలని ఈనెల 9న విడుదల చేయడానికి ప్లాన్ చేసాము. ఇప్పుడు వస్తున్న మా సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.