దీపక్ సరోజ్ హీరోగా మరో అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధార్థ్ రాయ్ ఉంటుందా?

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

దీపక్ సరోజ్ హీరోగా మరో అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధార్థ్ రాయ్ ఉంటుందా?

Advertiesment
siddartha roy
, గురువారం, 16 ఫిబ్రవరి 2023 (19:26 IST)
siddartha roy
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై  జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంతో హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
 
ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సిద్ధార్థ్ రాయ్’ అనే టైటిల్ పెట్టారు. కాన్సెప్ట్ పోస్టర్‌ను హరీష్ శంకర్ ఆవిష్కరించగా, అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్ ఎక్ సెంట్రిక్ లైఫ్ స్టొరీ’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. రెండు పోస్టర్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లతో, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు గడ్డంతో, దీపక్ తన దుస్తుల మొత్తం రక్తంతో కనిపిస్తున్నాడు. మరో పోస్టర్‌లో లవర్ పాత్ర పోషించిన తన్వి నేగి తో లిప్ లాక్ చేస్తూ కనిపించాడు. సిద్ధార్థ్ రాయ్ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
కొత్తవారితో ఈ చిత్రం రూపొందుతున్నప్పటికీ, ఇందులో కొంత మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు . సామ్ కె నాయుడు కెమరా మెన్ గా, రాధన్ సంగీత దర్శకుడిగా ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్‌లోని రిచ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావణాసుర లో మై పాగల్ హోగయా సాంగ్ గ్లిమ్ప్స్