కరోనా కాలంలో ప్రభుత్వాలు చేయలేని మంచి పనులు పలువురు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడంపై సర్వత్రా ప్రజల్లో వారిపై పాజిటివ్ కోణం వుంది. ఇటీవల సినీమారంగానికి చెందిన పలువురు తమకు చేతనైనంత స్థాయిలో వేక్సిన్‌లు, ఆక్సిజన్ సిలెండర్లు, నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. తాజాగా సుకుమార్ రాజోలు అనే మారుమూల గ్రామంలో కరోనా పేషెంట్లకు అందుబాటులో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ ఏరియా మాజీ ఎం.పి. హర్షకుమార్, సుకుమార్‌కు ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే కాకుండా చిన్న వీడియో బైట్‌ను కూడా రిలీజ్ చేశారు.
అందులో ఏమి చెప్పారంటే, ఈ పేండమిక్ టైంలో రోగులకు సత్వరం ఏమి కావాలో వాటిని సుకుమార్‌గారు సప్లయి చేశారు. 40లక్షలు ప్రకటించిన 10 రోజుల్లోనే కార్యరూపం దాల్చారు. ఇంత త్వరగా పనులు చేస్తారని అనుకోలేదు. ఆక్సిజన్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడినవారు ఆయన. చాలా కష్టమైన పనిని ప్రభుత్వాలు కూడా చేయలేదు. కానీ సుకుమార్ చేశాడు. ఆయనకు ఈ ఊరి ప్రజలపై ప్రేమ అటువంటిది. అందరూ ఇలా వుంటే దేశానికి ఎంతో మేలు చేయవచ్చు. అని వివరించారు. ఈ సందర్భంగా తనకు ఫోన్ చేసి వీడియో కూడా పంపిన హర్షకుమార్‌ను సుకుమార్ మీ అభిమానానికి ధన్యవాదాలు అని తెలిపారు.