Sudeep, Vikranth Rona, team, dubai
శాండిల్‌వుడ్ బాద్‌షా నటుడిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. ఈ వేడుక ఆదివారం(జనవరి 31) రాత్రి 9 గంటలకు కిచ్చా క్రియేషన్స్, యూ ట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో సిల్వర్‌జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్.. 'విక్రాంత్ రోణ'తో సరికొత్తగా పరిచయం అయ్యారు.
ఆసక్తికరమైన విషయమేమంటే కోవిడ్ ప్రభావం తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేసిన భారీ బడ్జెట్ మూవీ 'విక్రాంత్ రోణ'. సుదీప్ అంకిత భావం. సినిమా సరిహద్దులు మార్చి, భారీ స్థాయిలో సినిమాను రూపొందించడానికి దోహదపడింది. దుబాయ్‌లోని ఆకాశ హర్మ్యం బుర్జ్ ఖలీఫాలో 'విక్రాంత్ రోణ' టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త ఆధ్యాయానికి కిచ్చా సుదీప్ శ్రీకారం చుట్టారు.
గ్రాండ్ లెవల్లో జరిగిన 'విక్రాంత్ రోణ' టైటిల్ లోగో, స్పీక్ పీక్ రిలీజ్ వేడుకకు బుర్జ్ ఖలీఫా భవంతి సాక్ష్యంగా నిలిచింది. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటే ఘట్టమిది. ఎందుకంటే మూడు నిమిషాలు వ్యవథి గల 'విక్రాంత్ రోణ' స్నీక్ పీక్‌ను బుర్జ్‌ఖలీఫా భవంతిలో విడుదల చేసిన వేడుక చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వేడుకలో టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. ఈ వేడుక కోసం సుదీప్ 2000 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఎత్తున్న కటౌట్‌తో సూపర్‌స్టార్ సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు.
జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేశారు. అలంకార్ పాండియన్ సహ నిర్మాత. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్.జె ప్రొడక్షన్ డిజైననర్‌గా వ్యవహరించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో 'విక్రాంత్ రోణ' చిత్రం విడుదలవుతుంది.