Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 4న సాయితేజ్‌, దేవ్ క‌ట్టా ‘రిప‌బ్లిక్‌’

Advertiesment
జూన్ 4న  సాయితేజ్‌, దేవ్ క‌ట్టా ‘రిప‌బ్లిక్‌’
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (21:13 IST)
Sai Tej, Republic movie
హీరో సాయితేజ్‌, ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాకు జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే నాడు ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ప్ర‌క‌టించారు. విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. కాగా, సోమ‌వారంనాడు ఈ చిత్ర రిలీజ్ డేను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. జూన్‌4న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్ల వెల్ల‌డించింది. దేశానికి రిప‌బ్లిక్ ఎలాగో మ‌నిషికికూడా రిప‌బ్లిక్ వుండాల‌నే కాన్సెప్ట్‌తో రూపొందుతోంద‌ని తెలిసింది. అది ఏవిధంగా ద‌ర్శ‌కుడు క‌థ‌లో చొప్పించాడ‌నే తెర‌పై చూడాల్సిందేన‌ని యూనిట్ చెబుతోంది.
 
ఇక సాయి సాయితేజ్  వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. అందువ‌ల్లే ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌ను సాయితేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘రిప‌బ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ‘రిప‌బ్లిక్‌’ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు  మాట్లాడుతూ - ‘‘సాయితేజ్ హీరోగా దేవ్ క‌ట్టా‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రిప‌బ్లిక్‌’ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.  ఐశ్వ‌ర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌, బాక్స‌ర్ దిన త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా
స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాన్ ఇండియా మూవీకి `హరహర వీరమల్లు` టైటిల్‌?