Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంజయ్ దత్ జీవితమే పోరాటం.. దీన్ని అధిగమిస్తారు.. భార్య మాన్యత

Advertiesment
Maanayata Dutt
, బుధవారం, 12 ఆగస్టు 2020 (15:52 IST)
Sanju
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్‌ స్పందించారు. సంజయ్ ఎప్పుడూ పోరాట యోధుడేనని.. ఈసారి కూడా విజయం సంజూదే అవుతుందని చెప్పుకొచ్చారు. శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరడంపై ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. 
 
బ్రీతింగ్ ప్రాబ్లెమ్‌తో సంజూ బాబా ఆస్పత్రిలో చేరడంతో ముందుగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగిటివ్ వచ్చింది. తీరా మున్నాభాయ్‌కి ఊపిరితిత్తుల కాన్సర్ అంటూ వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు ఇపుడది మూడో స్టేజ్‌లో ఉందన్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం సంజూ బాబా అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
 
ఈ సందర్భంగా సంజయ్ దత్ భార్య మాన్యత మీడియాకు ఓ లెటర్ విడుదల చేసింది. ఈ లెటర్‌లో ఆమె మాట్లాడుతూ.. సంజయ్ దత్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్ధించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు సంజయ్ దత్ జీవితమే పోరాట మయం. ఆయన తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కాన్సర్‌తో గతంలో తల్లిని పోగుట్టుకున్నాడు. ఆ తర్వాత టాడా కేసులో జైలు జీవితం గడిపాడు.
 
అలాగే ఈ క్యాన్సర్‌ను కూడా సంజయ్ జయిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయమై అనవసరమైన సమాచారాన్ని మాత్రం వ్యాప్తి చేయకండి అంటూ వేడుకుంది. ప్రస్తుతం సంజయ్ దత్త పలు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసాడు. మరోవైపు ఈయన ప్రధాన పాత్రలో నటించిన 'సడక్ 2'తో పాటు 'భుజ్' సినిమాలు డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుందని గుర్తు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్డంగా బుక్కైన వర్మ, అమృత ఆర్జీవిని కోర్టు బోనులో నిలబెడుతుందా?