సింగర్ పూజా ప్రసాద్‌తో ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు పెళ్లి
						
		
						
				
టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు పెళ్లి చేయనున్నాడు. ఇందుకోసం ఆయన హీరో జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను తన ఇంటి కోడలిగా చేసుకోనున్నారు.
			
		          
	  
	
		
										
								
																	టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు పెళ్లి చేయనున్నాడు. ఇందుకోసం ఆయన హీరో జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను తన ఇంటి కోడలిగా చేసుకోనున్నారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దీంతో కార్తికేయకు - పూజా ప్రసాద్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వివాహ నిశ్చితార్థం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి రెండు కుటుంబాలవాళ్లు.. బంధువులు.. సన్నిహితులతో పాటు అక్కినేని అఖిల్, బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ హాజరయ్యారు.
 
									
										
								
																	
	 
	ఈ విషయాన్ని వరుడు కార్తికేయ ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేశాడు. కాగా, ఎస్ఎస్ కార్తికేయ 'బాహుబలి' సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా.. యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే, పూజాప్రసాద్.. భక్తి గీతాలు పాడి పేరుతెచ్చుకుంది. ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ బంధం వివాహ బంధంగా మారడం సంతోషంగా ఉందని కార్తికేయ ట్విట్టర్‌లో చెప్పాడు.