Srileela, Agent Mrichiga first look
కథానాయిక శ్రీలీల తన తదుపరి సినిమాలో ఏజెంట్ మ్రిచిగా ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాను అలరించింది. ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఏమీ షేర్ కాలేదు. ఈ అద్భుతమైన పోస్టర్ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ నిర్మాణంలో ఉందని సూచిస్తుంది. ఇటీవల, బాబీ డియోల్ కూడా ప్రొఫెసర్ గా కొత్త లుక్ ని షేర్ చేశాడు. ప్రాజెక్ట్ గురించి వెల్లడించలేదు.
బాలక్రిష్ణ తో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్ సినిమాల్లో నటించినా పెద్దగా ఆశించిన ఫలితం కనిపించలేదు. తాజాగా తెలుగులో పెద్ద హీరోలతో నటిస్తోంది.
తెలుగులో పలు విజయవంతమైన నాయికగా శ్రీలీల పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇప్పటివరకు చేయని పాత్రను ఇందులో పోషిస్తోంది. ఇప్పుడు ఏజెంట్ మిర్చి అంటూ శ్రీలీల ప్రొజెక్ట్ చేసుకుంటుంది.
అయితే, ఇది సినిమానా? ఓటీటీ వెబ్ సిరీస్.. అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అభిమానులను సన్నద్ధం చేయడానికి ఈరోజు లుక్ విడుదలచేసింది. దాని వివరాలు అక్టోబర్ 19న వెల్లడించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఇది మరో హిందీ ప్రాజెక్ట్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.