శ్రీరెడ్డి కథ ''క్లైమాక్స్''కు వచ్చేసింది.. ఎలాగంటే? (video)

సోమవారం, 11 నవంబరు 2019 (14:07 IST)
అవును.. శ్రీరెడ్డి కథ ''క్లైమాక్స్''కు వచ్చేసింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఓ ఆట ఆడుకున్న శ్రీరెడ్డి చివరికి సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. తాజాగా శ్రీరెడ్డి.. "క్లైమాక్స్" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీరెడ్డి తన నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. ''డ్రీమ్‌" చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
 
ఇందులో డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు పాత్ర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. పాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.క‌రుణాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు శ్రీరెడ్డి.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో కూడా తన నిజ జీవిత పాత్రనే చేస్తున్నట్టు శ్రీరెడ్డి ప్రకటించింది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న సమంత, చైతూ దంపతులు.. ఫోటోలు వైరల్