Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి చిన్న కూతురు భర్త, నివృతితో కలిసి ఇలా ఫోజిచ్చింది.. (ఫోటో)

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీజ తన భర్త కల్యాణ్, కుమార్తె నివృతితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత ఏడాది

Advertiesment
చిరంజీవి చిన్న కూతురు భర్త, నివృతితో కలిసి ఇలా ఫోజిచ్చింది.. (ఫోటో)
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:01 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీజ తన భర్త కల్యాణ్, కుమార్తె నివృతితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత ఏడాది మార్చిలో ప్రవాస వ్యాపారవేత్త కల్యాణ్‌ను పెళ్లి చేసుకుని, వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న శ్రీజ, మొట్టమొదటిసారిగా భర్త కుమార్తెతో కలిసి దీపావళి సందర్భంగా తీసిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు త్వరలో శ్రీజ భర్త కల్యాణ్ కూడా హీరోగా నటిస్తాడని సమాచారం. ప్రస్తుతం డ్యాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటున్న కల్యాణ్‌కు ఎలాగూ మెగా అభిమానుల మద్దతు ఉంటుంది. దీంతో హీరోగా మంచి పేరు కొట్టేసే ఛాన్సుందని తెలుస్తోంది. అంతేకాకుండా చిరంజీవి కూతురు శ్రీజ కూడా సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ చిత్రానికి టైటిల్ వేటలో త్రివిక్రమ్.. పరిశీలనలో 'గోకుల కృష్ణుడు'