Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడుదలకు సిద్ధమైన "సాఫ్ట్ వేర్ బ్లూస్"

విడుదలకు సిద్ధమైన
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:50 IST)
Soft ware blus
శ్రీరాం, భావనా చౌదరి, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం "సాఫ్ట్ వేర్ బ్లూస్ష‌.  ఈ చిత్రం మార్చి మూడవ వారంలో థియేటర్లలో విడుదలవుతుంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సమయంలోనే నిర్మాతలకు "సాఫ్ట్ వేర్ బ్లూస్" కథ చెప్పడం జరిగింది. వారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అందరు "సాఫ్ట్ వేర్ బ్లూస్" అంటే ఎదో అను కుంటున్నారు. బ్లూస్ అంటే కష్టాలు అని అర్థం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పడే కష్టాలను తెలియజేస్తూ..ఈ సినిమా లవ్, కెరీర్, ఫ్రెండ్స్ మధ్య నడుస్తుంది.

హీరో బెస్ట్ పెర్ఫామ‌ర్ ఇయర్ అవార్డ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. తను అవార్డ్ ఎందుకు తెచ్చుకోవాలను కుంటాడనే థీమ్ తీసుకొని, సాఫ్ట్ వేర్ జాబ్ సెర్చింగ్ లోని కష్టాలు, అలాగే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ను తెలుపుతూ  ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీ రూపొందించడం జరిగింది. ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో వర్క్ చేశారు. సంగీత దర్శకుడు మూవీకి మంచి పాటలందించాడు. మార్చి మూడవ వారంలో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.
 
నటుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ,  సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కష్టాలను తెలియజేస్తూ సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా "సాఫ్ట్ వేర్ బ్లూస్".సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారు తను జాబ్ వదులుకొని ఈ సినిమా చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ కు సంబంధంలేని వారికి కూడా ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.
 
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ, సాఫ్ట్ వేర్ జాబ్ అంటే అందరికీ చులకన భావం ఉంటుంది. నేను ఈ కథ విన్న తర్వాత వారికి ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ మూవీ ద్వారా తెలుసుకున్నాను. పాటలు బాగా వచ్చాయి. ఇందులో వున్న మూడు పాటలు కథకు అనుగునంగానే  వస్తాయి అని అన్నారు.
 
హీరోయిన్ భావన మాట్లాడుతూ.. ఇది నాకు మొదటి చిత్రమైనా సెట్ లో నటీనటులందరూ నాకు బాగా కో ఆపరేట్ చేశారు. ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
 
హీరో శ్రీరాం మాట్లాడుతూ... అందరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అంటే  లగ్జరీ జీవితం అనుకుంటారు. కానీ  వారికి కష్టాలు, కన్నీళ్లు వుంటాయని ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. సినిమా చూసిన వారందరికీ  "సాఫ్ట్ వేర్ బ్లూస్" కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ కు ఫస్ట్ మూవీ అయినా సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా చేస్తున్న తను నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో  ఈ మూవీ చేస్తున్నాడు.తనకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఇంకా నటుడు బస్వరాజ్, కె.యస్.రాజు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ మిర్చి రికార్డ్ దాటేసిన ఉప్పెన, మేకింగ్ వీడియో ఔట్