Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేక్ వార్తలను నమ్మవద్దు.. రాళ్ల దాడి జరగలేదు.. మంగ్లీ

Advertiesment
Mangli
, సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (19:40 IST)
తెలుగు ప్రముఖ జానపద గాయని మంగ్లీ కర్ణాటకలో తనపై దాడికి పాల్పడ్డారనే వార్తలపై స్పందించారు. పుకార్లను ఖండిస్తూ తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. గాయని మంగ్లీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో "నా గురించి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చిన ఫేక్ వార్తలను నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను..." అని ట్వీట్ చేసింది. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. 
 
"బళ్లారిలో జరిగిన ఒక కార్యక్రమంలో నిన్న నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరందరూ ఫోటోలు, వీడియోలలో చూడగలిగినట్లుగా, ఈవెంట్ చాలా విజయవంతమైంది... అంటూ మంగ్లీ తెలిపింది. 
 
కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. పోలీసులు, అధికారులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇవన్నీ నా ప్రతిష్టను దిగజార్చేందుకే జరుగుతున్నాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను... అంటూ మంగ్లీ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్ మహారాజా రవితేజ రావణాసుర థీమ్ సాంగ్