Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Advertiesment
Sundeep Kishan

దేవీ

, సోమవారం, 10 నవంబరు 2025 (17:39 IST)
Sundeep Kishan
దక్షిణాదిలోని అత్యంత విశ్వసనీయ, హై ప్రొడక్షన్ వాల్యూస్, గ్లోబల్ ప్రమోషనల్ రీచ్ గల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీ సిగ్మా చిత్రం 65 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అనౌన్స్ చేశారు. నాలుగు నెలల పాటు జరిగిన షూటింగ్ ఇప్పుడు సినిమా షెడ్యూల్‌లో 95% పూర్తయింది.
 
ఈ చిత్రానికి సిగ్మా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ కనిపించారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని, తన చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లుగా కనిపించిన సందీప్ లుక్ అదిరిపోయింది. ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా హీరో పాత్రలోని ఇన్‌టెన్స్ యాంగిల్‌తో పాటు సినిమా ట్రెజర్ హంట్ కథాంశాన్ని సూచిస్తోంది.
 
కథ ఒక ధైర్యశాలి, నియమాలకు అతీతమైన వ్యక్తి నేపధ్యంలో వుంటుంది. అతని ప్రయాణం థ్రిల్లింగ్ ట్రెజర్ హంట్, హై-స్టేక్స్ క్రిమినల్ హీస్ట్ అంశాలతో కలిపి, యాక్షన్‌, అడ్వెంచర్‌ గా వుంటుంది. 
 
ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా అలరించనున్నారు. భాషా, ప్రాంతీయ హద్దులను దాటి అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అతడిని పాన్-ఇండియన్ స్టార్‌గా నిలబెడుతుంది ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరికొన్ని ఎక్సయిటింగ్ అతిధి పాత్రలు ఉన్నాయి.
 
లైకా ప్రొడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమారన్ మాట్లాడుతూ..“డైరెక్టర్ జేసన్ సంజయ్ తన మాట ప్రకారం అద్భుతమైన రిజల్ట్ అందించారు. 65 రోజుల్లో 95% షూటింగ్ పూర్తి చేయడం, ముఖ్యంగా ఒక డెబ్యుట్ డైరెక్టర్‌గా, అసాధారణ విజయమే. లైకాతో ఆయన దర్శకత్వ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 
 
దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. “ఈ టైటిల్‌, కాన్సెప్ట్‌ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్ హంట్‌, హీస్ట్‌, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ సినిమా అనుభూతిని అందిస్తుంది. థమన్‌ సంగీతం, సందీప్ కిషన్‌ యాక్షన్ ఎనర్జీ, లైకా ప్రొడక్షన్స్‌ గ్రాండ్ స్కేల్‌ – ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. నా టీం అందరి సహకారంతో షూటింగ్‌ను సమయానికి పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఒక పాట మిగిలి ఉండగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో విడుదలకు సిద్ధమౌతున్నాం.  
 
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ప్రతి సన్నివేశాన్నీ ఎక్సయిటింగ్ మార్చే సంగీతం అందిస్తున్నారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్ కథలోని థ్రిల్‌, భావోద్వేగం, డ్రామాను మరింత పెంచుతుంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్, ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్., ఆర్ట్ డైరెక్టర్ బెంజమిన్ ఎం. కలిసి ఈ చిత్రాన్ని విజువల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు.
 
తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం చెన్నై, సేలం, తలకోన, థాయ్‌లాండ్ ప్రాంతాల్లో షూట్ చేశారు. లైవ్ లొకేషన్లు, ప్రత్యేకంగా రూపొందించిన సెట్లతో ఒక అద్భుతమైన అడ్వెంచర్ ఎక్స్‌పీరియెన్స్ ని ప్రేక్షకులకు అందించబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి