Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

Advertiesment
Ravi Teja, Bhartha mahasayulaku viznapthi

దేవీ

, సోమవారం, 10 నవంబరు 2025 (17:26 IST)
Ravi Teja, Bhartha mahasayulaku viznapthi
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న RT 76 చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదలయింది. ఈ సినిమాకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే పేరు పెట్టారు. సంక్రాంతి పండుగ వైబ్‌ ను అందిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ పేరు రామ సత్యనారాయణ. ఇద్దరు హీరోయిన్ల నడుమ సాగే డ్రామా ఈ సినిమాలో కథగా చెప్పబడింది.
 
దర్శకుడు కిషోర్ తిరుమల వాయిస్ ఓవర్‌లో వివరించిన టెంపుల్ అనౌన్స్మెంట్ తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఈ అనౌన్స్మెంట్ గురించి రవితేజ క్యారెక్టర్ మాట్లాడుతూ.. 'నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్ ఏఐ అన్నిటిని అడిగాను. మేబి వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్య పోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి'' అంటూ తనను రామ సత్యనారాయణగా పరిచయం చేసుకోవడం, భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ రివిల్ కావడం అర్థరహితంగా వుంది.
 
రవితేజ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటిలిటీని ప్రజెంట్ చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల టచ్‌తో టైటిల్‌ ఫ్యామిలీ ఫీలింగ్‌ కలిగించింది. గ్లింప్స్ చూస్తే సినిమా పక్కా ఎంటర్టైనింగ్‌గా, మనసుని హత్తుకునేలా ఉండబోతోందని అనిపిస్తోంది.
 
ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.  విజువల్స్ క్లాసీగా, గ్రాండుగా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా లైట్‌హార్ట్‌డ్ టోన్‌కి చక్కగా సరిపోయి, ఫన్‌ క్వోటెంట్‌ను మరింత పెంచుతోంది.
 
ప్రస్తుతం రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి పై ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌పై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
 
టైటిల్ గ్లింప్స్ ద్వారా, భర్త మహాశయులకు విజ్ఞప్తి' 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bindu Madhavi: అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగితే ఏమయిందినే కథతో దండోరా సిద్ధం