Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రియా, నేను ఎంతోకాలంగా స్నేహితులం - శర్వానంద్

Advertiesment
Shriya
, గురువారం, 9 డిశెంబరు 2021 (16:27 IST)
Shriya, Sharvanand
గమనం సినిమాతో సుజనా రావు  దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్, దేవా కట్టా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
శర్వానంద్ మాట్లాడుతూ.. ‘బాబా గారి వల్లే నేను ఇక్కడకు వచ్చాను. మా ప్రయాణం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో మొదలైంది. నిర్మాతగ మారతానని చెప్పినప్పుడు అవసరమా? అని అనిపించింది. కానీ కథ విన్నాక ఇదెంతో గొప్పదని తెలిసింది. గమ్యం, ప్రస్థానం, జర్నీ, గమనం అన్నీ కూడా ట్రావెల్ మీదే ఉన్నాయి. ఇళయరాజా గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. శివ ఓ ప్రామిసింగ్ యాక్టర్. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. ప్రియాంక మంచి నటి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డిసెంబర్ 10న గమనం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. శ్రియా, నేను ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్. సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. మంచి పాత్రలను ఎంచుకంటూ ముందుకు వెళ్తుంది’ అని అన్నారు.
 
శ్రియ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఫ్రేమ్ కూడా ఒక అందమైన పెయింటింగ్‌లా మారింది. బాబా గారి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కమల పాత్రను ఇచ్చినందుకు సుజనకు థ్యాంక్స్. ఈ సినిమా వెనక ఎంతో మంది కష్టం ఉంది. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
గొట్టెముక్కల పద్మారావు మాట్లాడుతూ.. ‘సినిమాను తీయాలని అనుకోవడం వేరు.. చేయాలని అనుకోవడం వేరు. నేను కూడా మంచి సినిమాలను తీశాను. నా కూతురు ఎవ్వరి దగ్గరగా పని చేయలేదు. డైరెక్టర్ అనే కుర్చీని చూసి దర్శకురాలైంది. నా కూతురు చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ తీసింది. వాటిని చూసి నిర్మాతలు ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి విజయవంతం కావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీర‌లంటే ఇష్ట‌మంటున్న బికినీ భామ ఇలియానా - తెలుగులోకి రావాల‌ని ప్రార్థ‌న చేయండి