Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇళ‌య‌రాజా - మ్యూజిక్ స్కూల్లో సింగర్‌గా, న‌టుడిగా షాన్

ఇళ‌య‌రాజా - మ్యూజిక్ స్కూల్లో సింగర్‌గా, న‌టుడిగా షాన్
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (20:54 IST)
Ilayaraja- Shaan
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ  ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ షాన్. ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  త‌న విల‌క్ష‌ణ గాత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళ‌య‌రాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగ‌ర్‌ను చూసి, పాత్ర‌కు స‌రిపోతాడ‌ని భావించి త‌మ‌ సినిమాలో న‌టించాల‌ని చిత్ర‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు కోరారు. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ క‌నిపించ‌బోతున్నారు. షాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు సినిమాలో పాట పాడ‌టం విశేషం. సృజ‌నాత్మ‌క‌మైన క‌ళ‌ల‌లో రెండు ర‌కాలైన పాత్ర‌ల‌ను పోషించ‌డానికి, వ‌ద్ద‌ని చెప్ప‌లేక‌పోయాన‌ని షాన్ అన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘‘ఇళ‌యరాజాగారి స్టూడియోలో షాన్ పాట పాడుతున్న‌ప్పుడు త‌న‌లోని  విల‌క్ష‌ణ‌త  నాకు న‌చ్చింది. అలాంటి ఓ పాత్ర నా సినిమాకు అవ‌స‌రం అని భావించాను. సాధార‌ణంగా సింగ‌ర్స్ ఎవ‌రూ అదే సినిమాలో న‌టించ‌లేద‌ని నేను భావిస్తున్నాను. ఇది షాన్‌కు కొత్త అనుభ‌వాన్ని ఇస్తుంది. అందుక‌నే న‌టుడిగా త‌న‌కు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చాను. సింగ‌ర్‌గా కొన్నేళ్ల నుంచి షాన్ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే  ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రంతో తను నటుడిగానూ మెప్పించబోతున్నారు. షాన్  పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ఎగ్జ‌యిట్‌మెంట్ చేసే అంశాలెన్నో ఉన్నాయి. మిమ్మ‌ల్ని థియేట‌ర్స్‌లో క‌ల‌వ‌డానికి ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. 
 
షాన్ మాట్లాడుతూ ‘‘‘మ్యూజిక్ స్కూల్’లో భాగం కావడం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో పాట పాడ‌ట‌మే కాదు, న‌టుడిగా క‌నిపిస్తాను. న‌టించ‌డం నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. మాస్ట్రో ఇళ‌య‌రాజాగారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌టం గొప్ప విష‌యం. సృజ‌నాత్మ‌క క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని చెప్పే సినిమా ఇది. మ్యూజిక్‌లో చాలా వేరియేష‌న్స్‌ను చూపించే ఈ సినిమాలో..క‌ళ‌లు, ఆట‌లు కూడా పిల్లల జీవితంలో ముఖ్య‌మ‌ని చెబుతారు. సినిమాలోని ప్ర‌ధానాంశం నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంత‌గానో న‌చ్చింది. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తో సినిమాను చేస్తున్న పాపారావుగారికి థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో పాట పాడ‌టంతో పాటు న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇది నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది ’’ అన్నారు. 
 
యామిని ఫిలింస్ నిర్మించ‌నున్న ‘మ్యూజిక్ స్కూల్‌’  సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతుంది.  ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫ‌ర్ ఆడ‌మ్ ముర్రే కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్‌, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, విన‌య్ వ‌ర్మ‌, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో 12 పాటలుంటాయి. పిల్ల‌ల‌కు క‌ళ‌లు, ఆట‌ల ప్రాధాన్య‌త‌ను తెలియ‌నీయ‌కుండా కేవ‌లం వారిని ఇంజనీర్లు, డాక్ట‌ర్స్‌గా చూస్తూ  మూస పద్ధతిలో ఉంటూ ఎలాంటి క్రియేటివిటీలేని నేటి విద్యావ్య‌వ‌స్థ‌లో పిల్ల‌లు తెలియ‌ని ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని చెప్ప‌డ‌మే ఈ సినిమా ప్ర‌ధానాంశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాయనితో మణిశర్మ తనయుడి వివాహం..