సిల్క్ స్మిత మరణంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతూనే వుంది. ఆమెపట్ల సీనియర్ నటి అనురాధ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెతో మీ బాండింగ్ ఎలా ఉండేది అని ప్రశ్న ఎదురుకాగా అనురాధ మాట్లాడుతూ.. సిల్క్ స్మిత తనకు అంతగా క్లోజ్ కాదని కేవలం ఒక మంచి ఫ్రెండ్ అని తెలియజేసింది. తనకు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు రిజర్వుడుగా ఉండేది.
తన పర్సనల్ విషయాలు అసలు ఎవరికి షేర్ చేసేది కాదని తెలియజేసింది. అందుచేతనే మేము కూడా ఎవరికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకొని వాళ్ళము కాదు అని తెలియజేసింది. సిల్క్ స్మితా కి బయట వారు ఆమెకు పొగరు అనుకుంటారు కానీ ఆమె చిన్నపిల్లల మనస్తత్వం కలదని తెలియజేసింది.
సిల్క్ స్మిత మరణించడానికి ముందు రోజు తనకి ఫోన్ చేసింది అప్పుడు అంతా ల్యాండ్ లైన్ లోనే కదా ఏం చేస్తున్నారు మీరు అడిగింది. మా ఆయన బెంగళూరు నుండి వస్తున్నాడు అందుచేతనే ఇంట్లోనే ఉన్నాను అని తెలియజేశాను తెలిపింది.
అలాంటి సమయంలోనే మీరు కొద్దిగా మా ఇంటి దగ్గరికి వస్తారా అని సిల్క్ స్మిత అతని అడిగినట్లు తెలియజేసింది. కానీ రేపు కచ్చితంగా పాపని స్కూల్‌కి వదిలి వస్తాను అని తెలియజేశానని తెలిపింది. కానీ ఉదయం వెళ్లేసరికి ఆమె మరణించడంతో తను, శ్రీ దివ్య కలసి బాడీ పోస్టుమార్టం కొరకు తీసుకెళ్లామని తెలియజేసింది.