Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

చివరి షెడ్యూల్లో నాగ చైతన్య "సవ్యసాచి"

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీపార్ట్ ఆగస్ట్ 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్‌

Advertiesment
Savyasachi in last schedule
, సోమవారం, 30 జులై 2018 (21:43 IST)
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీపార్ట్ ఆగస్ట్ 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్‌లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తికానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర నిర్మాత‌లు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహాయ దర్శకుడు: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, సహ నిర్మాత: ప్రవీణ్.ఎం, నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), కథ-మాటలు-చిత్రానువాదం-దర్శకత్వం: చందు మొండేటి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడవి శేష్ 'గూఢచారి' చిత్రం టాలీవుడ్ చిత్రమేనా? డౌటుగా వుందట...