Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాచ్ తో సాత్విక్ వర్మ హీరోగా చేయ‌డం హ్యాపీగా ఉంది- నిర్మాత రమేష్ గనమజ్జి

Advertiesment
బ్యాచ్ తో సాత్విక్ వర్మ హీరోగా చేయ‌డం హ్యాపీగా ఉంది- నిర్మాత రమేష్ గనమజ్జి
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:55 IST)
Satvik Varma, Ramesh Ganamajji, Raghu Kunche and others
బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ,నేహా పటాన్ జంటగా శివ దర్శకత్వంలో రమేష్ గనమజ్జి నిర్మించిన చిత్రం 'బ్యాచ్". రఘు కుంచే సంగీతం అందించారు.ఈ నెల 18 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
 
చిత్ర నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథను నమ్మి సినిమా స్టార్ట్ చేశాము.నటీనటులు టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా సెట్ అయ్యారు.ఈ రోజు సినిమా ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం వారే. రఘు మంచి సంగీతం అందించాడు. కొత్త సింగర్స్ తో పాడించి వారిని ఇండష్ట్రీకు పరిచయం చేశాము. ఇండష్ట్రీలో  పెద్ద ఆర్టిస్టులతో 80 సినీమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన సాత్విక్ ను నేను హీరోగా లాంచ్ చేసే బాధ్యత ను నాపై ఉంచినందుకు ధన్యవాదాలు.ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డను జన్మనిచ్చే సమయంలో ఎంత ప్రసవ వేదన చెందుతుందో అంతకంటే 1000 రేట్లు నేను అనుభవించడం జరిగింది.ఆ తరువాత ఆ తల్లి బిడ్డను చూసుకొని ఎంత మురిసి పోతుందో..ప్రేక్షకులు మా  సినిమాను ఆదరించి సక్సెస్ చేసినందుకు నేను అంతే సంతోషంగా ఉన్నాను.ఈ సినిమా కోసం ఎంతోమంది నాకు సపోర్ట్ గా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాను అన్నారు. 
 
webdunia
Batch success cake cutting
చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.రఘు కుంచె గారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. 
 
డి.యస్ రావ్ మాట్లాడుతూ.. మంచి మ్యూజిక్ ఇచ్చిన  రఘుకుంచె ఒక్కొక్క సాంగ్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ ను క్రెయేట్ చేశారు.100 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది అన్నారు. 
 
సంగీత దర్శకుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ముందుగా నిర్మాత రమేష్ ను అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాను విడుదల చేయడం చాలా కష్టం.అలాంటిది ఈ సినిమాను 100 థియేటర్స్ లలో విడుదల చేసి సక్సెస్ అయ్యాడు.ఇందులో సాత్విక్, నేహా లు చాలా చక్కగా నటించారు.ఈ చిత్రం తరువాత దర్శక నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 
 
హీరో సాత్విక్ మాట్లాడుతూ... సీనియర్ ఆర్టిస్టులు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.ఇలాంటి మంచి. చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 
 
హీరోయిన్ నేహా పటాన్ మాట్లాడుతూ..ఎంతో మంది పెద్ద ఆర్టిస్టుల మధ్య నేను నటిస్తు న్నందుకు మొదట ఎంతో భయపడ్డాను. ఆతరువాత వారంతా నన్ను ఎంకరేజ్ చేయడంతో నేను నటించగలిగాను. ఇలాంటి మంచి. చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం