టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ రెండో షెడ్యూల్ ఈ నెల 21 వరకు కొనసాగనుంది.
ఈ షెడ్యూల్ కోసం ఇటీవల కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందంట. అది కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.
ఈ వీడియోలో మహేష్ తన సినిమాలోని ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నారని, చిత్రీకరణలోని ఆఫ్ కెమెరా మేకింగ్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో క్లారిటీ కావాలంటే శివరాత్రి వరకు వేచి చూడాల్సిందే.