టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని 96 తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఓ బేబీ సూపర్ సక్సెస్ తర్వాత శర్వానంద్‌తో జోడీ కట్టనుంచి సమంత. ఈ సినిమా తర్వాత ఓ బేబీ లాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేయనుందని తెలుస్తోంది.
తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో ఈ మూవీ రాబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ డైరెక్టర్ గతంలో నయనతారతో మాయ, తాప్సీతో గేమ్ ఓవర్ వంటి సినిమాలను తెరకెక్కించారు. దీంతో సమంత తదుపరి చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్‌గా రాబోతుందని టాక్.
ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. సమంతకు తెలుగుతో పాటు తమిళ్‌లోనూ మంచి మార్కెట్ ఉండటం విశేషం. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే… మరోవైపు రెండు వెబ్ సిరీస్‌లను కూడా చేస్తోంది సమంత అక్కినేని. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 96 సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది.
మరోవైపు.. తాజాగా సూపర్ డీలక్స్ చిత్రానికిగాను జీ నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జ్యూరీ అవార్డు అందుకుంది సమంత. ఈ వేడుకలో సమంత తన చీరకట్టుతో అందరి కళ్ళు తనవైపుకి తిప్పుకునేలా చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.