Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మే బాడీ... మై ఛాయిస్" - ఇరాన్ మహిళలకు సంఘీభావం.. న్యూడ్‌గా మారిన నటి

Advertiesment
elaaz norouzi
, గురువారం, 13 అక్టోబరు 2022 (08:12 IST)
హిజాబ్ వస్త్ర ధారణకు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు గళమెత్తారు. రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో అనేక  మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరి నిరసనలకు అనేక దేశాలకు చెందిన మహిళలు తమ మద్దతను ప్రకటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఒకరు ఇరాన్ మహిళకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. మై బాడీ మై ఛాయిస్ పేరుతో ఓ న్యూడ్ వీడియను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ అయింది. 
 
సేక్రెడ్​ గేమ్స్ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించిన ఎల్నాజ్ నొరౌజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అనేక దుస్తులు ధరించిన ఆమె.. పైనుంచి నల్లటి బుర్ఖా వేసుకుంది. అనంతరం ఒకదాని తర్వాత ఒకటి దుస్తులని తీసేస్తూ 30 సెకన్ల వీడియో పోస్టు చేసింది. దీంతో పాటు 'ఈ ప్రపంచలోని ప్రతి మహిళ.. ఎక్కడి నుంచి వచ్చిందో అని సంబంధం లేకుండా తనకు నచ్చిన దుస్తులు.. తమకు నచ్చిన విధంగా.. నచ్చిన చోట ధరించొచ్చు' అని రాసుకొచ్చింది.
 
'ఏ పురుషుడికైనా, మహిళకైనా.. ఆడవాళ్లు ధరించే దుస్తులు గురించి జడ్జ్​ చేసే హక్కు గానీ.. ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పే అధికారం కానీ లేదు' అని నటి అభిప్రాయపడింది. 'ప్రతి ఒక్కరికి వివిధ ఆలోచనలు, నమ్మకాలు ఉంటాయి' ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం. ప్రతి మహిళకు తన గురించి నిర్ణయించుకునే అధికారం ఉంది. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు. నేను తమకు ఏది కావాలో అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రచారం చేస్తున్నాను' అని రాసుకొచ్చింది. 
 
కాగా, నటి ఎల్నాజ్ నొరోజీ.. ఇరాన్​లోని టెహ్రాన్​లో జన్మించింది. 2017లో వచ్చిన 'మాన్​ జావో నా' అనే చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అనంతరం 'ఖిడో ఖుండి' అనే పంజాబీ చిత్రంలో నటించింది. 2018లో నెట్​ఫ్లిక్స్​లో వచ్చిన 'సేక్రెడ్​ గేమ్స్​' అనే సిరీస్​లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది. ఆ తర్వాత 2019 లో జీ5లో వచ్చిన వెబ్​ సిరీస్​ 'అభయ్'​లో కునాల్​ ఖేముతో కలిసి నటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిగేలు రాణికి పుట్టినరోజు.. ఒక లైలా కోసం వచ్చి... నాటుకుపోయింది..