Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోట్ల విలువైవ వస్తువులను ఇంటికి తీసుకెళ్లిన స్టార్ హీరో...

కోట్ల విలువైవ వస్తువులను ఇంటికి తీసుకెళ్లిన స్టార్ హీరో...
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:27 IST)
'బాహుబలి' తర్వాత ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా "సాహో". షూటింగ్ మొదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ యాక్షన్ సన్నివేశాలతో బాలీవుడ్ నటులతో, అత్యాధునిక సాంకేతికతలతో టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు సినిమా యూనిట్. 
 
'సాహో' సినిమాలో యాక్షన్ సీన్లు చేయడానికి కోసం ప్రభాస్ చాలా ఎక్కువగానే కష్టపడ్డారు. ఎండ, వాన, దుమ్ము, ధూళిని లెక్క చేయకుండా ఫైట్స్‌లో, ఛేజింగ్‌లలో పాల్గొన్నాడు. ఈ సినిమాలో అత్యాధునిక కార్లు, బైకులు, ట్రక్స్ వినియోగించడం జరిగిందట. 'సాహో' చిత్రంలో నటించిన యాక్టర్లతోనే కాకుండా వాహనాలతో కూడా ప్రభాస్ అనుబంధం పెంచుకొన్నారట. ఇందుకోసం వాడిన వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో వాటిపై మనస్సు పారేసుకున్నాడట ప్రభాస్. 
 
అందుకే సాహో సినిమాలో తను పడిన కష్టానికి తీపి గుర్తులుగా వీటిని తన గ్యారేజ్‌లో పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారట. 'సాహో' చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్లకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసారని వినికిడి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆర్ఆర్ఆర్'కు మొదటి అవాంతరం.. చరణ్‌కు గాయం