ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీ తర్వాత అజయ్‌తో సినిమా చేసేందుకు హీరో రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నితిన్ ఇంట్రస్ట్ చూపించారు. అజయ్ నెక్ట్స్ మూవీ త్వరలో స్టార్ట్ అవుతుంది అనుకున్నారు కానీ... ఈ బ్లాక్‌బష్టర్ డైరెక్టర్‌కి రామ్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హ్యాండ్ ఇచ్చారు.
అయితే... ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో చైతన్య సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చైతన్య సరసన సమంత నటించనుందని.. ఈ క్రేజీ మూవీని జెమిని కిరణ్ నిర్మించనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా... ఇందులో చైతన్య పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడని... దీనికి మహా సముద్రం అనే టైటిల్ ఖరారు చేసారని కూడా టాక్ వచ్చింది.
అసలు మ్యాటర్ ఏంటంటే... చైతన్య వెంకీ మామ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్లో కొత్త దర్శకుడితో ఓ సినిమా... అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సొగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ చేయనున్నాడు. అజయ్ భూపతితో సినిమా లేదట. అసలే హీరో సెట్ కాక బాధపడుతుంటే... లేనిపోని వార్తలు ప్రచారంలోకి వచ్చి అజయ్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో బాగా మండినట్టుంది అజయ్‌కి.
ప్రచారంలో ఉన్న వార్తలపై ట్విట్టర్లో అజయ్ భూపతి స్పందిస్తూ... నా రెండో సినిమా ఎప్పుడు.. ఎవరితో.. ఎలా తీయాలో నాకు తెలుసు. ప్లీజ్ స్టాప్ ద రూమర్స్ అని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా చైతన్యతో సినిమా లేదని ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు అజయ్. పాపం.. ఎంత కష్టం వచ్చింది అజయ్‌కి..!