Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''జై లవ కుశ'' పోస్టర్ అదుర్స్.. తారక్ రెమ్యునరేషన్ ఎంత? హాలీవుడ్ సినిమా కాపీనా?

నందమూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. తారక్ ఫ్యాన్స్‌కు ఓ బిగ్ ట్రీట్ ఇచ్చాడు. త్రిపాత్రాభినయం చేస్తున్న ''జై లవ కుశ'' సినిమా పోస్టర్లు శుక్రవారం విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో విడుదలైన గంటల్లోపే ఫోటోలు వై

Advertiesment
''జై లవ కుశ'' పోస్టర్ అదుర్స్.. తారక్ రెమ్యునరేషన్ ఎంత? హాలీవుడ్ సినిమా కాపీనా?
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (16:12 IST)
నందమూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. తారక్ ఫ్యాన్స్‌కు ఓ బిగ్ ట్రీట్ ఇచ్చాడు. త్రిపాత్రాభినయం చేస్తున్న ''జై లవ కుశ'' సినిమా పోస్టర్లు శుక్రవారం విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో విడుదలైన గంటల్లోపే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. మూడు పాత్రల్లో కనిపించే తారక్.. విభిన్న గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. తారక్ రాకింగ్ పోస్టర్ వచ్చిందంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. జై లవ కుశ కోసం కల్యాణ్ రామ్ సోదరుడైనప్పటికీ మార్కెట్ రేటును బట్టి తారక్‌కు రూ.14కోట్ల రెమ్యునరేషన్ చెల్లించాడట. జై లవ కుశ టాలీవుడ్‌లో మాంచి హిట్ అవుతుందని సినీ పండితులు చెప్తున్న వేళ, ఈ సినిమా హాలీవుడ్ కాపీ అంటూ కూడా ప్రచారం సాగుతోంది. 
 
ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ హాలీవుడ్ కాపీ అని, ఇదే తరహాలో హాలీవుడ్ క్లాసిక్ కౌబాయ్ సినిమానే జై లవ కుశగా వస్తుందని టాక్ వస్తోంది. 2008లో దక్షిణ కొరియాకు  చెందిన ఓ నటుడు ట్రిపుల్ రోల్‌లో కనిపించాడని.. ఇదే తరహాలో ఎన్టీఆర్ జై, లవ, కుశ పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 21వ తేదీన విడుదల కానుంది. సెప్టెంబర్ మూడో తేదీన ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి దర్శకుడికి కోపమొచ్చింది.. తెలుగు సినిమాలు చేయడట.. బాలీవుడ్‌కి వెళ్ళిపోతాడట..?!