Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్జున్ రెడ్డి దర్శకుడికి కోపమొచ్చింది.. తెలుగు సినిమాలు చేయడట.. బాలీవుడ్‌కి వెళ్ళిపోతాడట..?!

అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతూనే వుంది. ఈ సినిమా పోస్టర్ల నుంచి విడుదలయ్యాక సన్నివేశాల మీద రచ్చ రచ్చ జరుగుతోంది. కానీ సినిమా మాత్రం విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకొని యూత్‌కి బాగా కనెక్ట్ కావడ

అర్జున్ రెడ్డి దర్శకుడికి కోపమొచ్చింది.. తెలుగు సినిమాలు చేయడట.. బాలీవుడ్‌కి వెళ్ళిపోతాడట..?!
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (15:36 IST)
అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం కొనసాగుతూనే వుంది. ఈ సినిమా పోస్టర్ల నుంచి విడుదలయ్యాక సన్నివేశాల మీద రచ్చ రచ్చ జరుగుతోంది. కానీ సినిమా మాత్రం విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకొని యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లతో దూసుకుపోతుంది.

యాంకర్ అనసూయ ఈ సినిమాపై కామెంట్ చేశారు. అర్జున్ రెడ్డి కథ తనది అంటూ నాగరాజు అనే రచయిత, దర్శకుడు ఫ్రేమ్‌లోకి వచ్చి తన కథని ఒక పోర్న్ సినిమా స్థాయిలో మార్చేశారని ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ మహిళా నాయకులు, మహిళా సంఘాలు అర్జున్ రెడ్డి వివాదాన్ని పెంచాయి.
 
ఈ వివాదాలతో ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవుతూ జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. కేవలం వివాదాలతో, యూత్‌కి నచ్చే బూతులతో సినిమా మొత్తం నడిపించేసి, అర్జున్ రెడ్డికి వచ్చిన బజ్‌తో కలెక్షన్ పొందాలనుకోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా దర్శకుడు మాత్రం విభిన్నంగా స్పందించాడు. సందీప్‌తో సినిమా చెయ్యడం కోసం ఇప్పుడు పెద్ద హీరోలు సైతం క్యూ కట్టేసే పరిస్థితి ఉంది. అయితే సందీప్ మాత్రం కాస్త సీరియస్ అయ్యాడు. తనను అడ్డుకోవాలని చూస్తే తాను తెలుగు సినిమాలను పక్కనబెట్టి.. బాలీవుడ్‌కు వెళ్ళిపోతానని చెప్పాడు. హిందీ, భోజ్‌పురి, కన్నడ... ఇలా ఏ భాషలో అయినా సినిమాలు తీసుకుంటానని వెల్లడించారు. 
 
బాలీవుడ్‌లో తనను బ్యాన్ చేస్తే హాలీవుడ్‌కు వెళ్ళిపోతా.. ఇంతకంటే ఏం చేయలేను. అసలు మహిళా సంఘాలు ఎందుకు స్పందిస్తున్నాయో తనకైతే అర్థం కావట్లేదన్నారు. ఈ కథ మరో సినిమా కథకు కాపీ అన్న వివాదం ఒకటి కొత్తగా పుట్టుకొచ్చినా... దీనిపై కూడా సందీప్ మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండస్ట్రీలో అనేక టార్చర్లు ఉంటాయ్.. అయినా ఇష్టమే : అనూ ఇమ్మాన్యుయేల్