Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదిరిందయ్యా ఎన్టీఆర్ జై లవకుశ... త్రిపాత్రాభినయంలో ఎన్టీఆర్(video)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాలంటే ఓ రేంజిలో వుంటాయి. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ తన తాజా చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ చిత్రానికి జై లవకుశ అని పేరు పెట్టారు. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాగా ఫస్ట్ లుక్ విడుదలలో త

Advertiesment
అదిరిందయ్యా ఎన్టీఆర్ జై లవకుశ... త్రిపాత్రాభినయంలో ఎన్టీఆర్(video)
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (13:50 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాలంటే ఓ రేంజిలో వుంటాయి. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ తన తాజా చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ చిత్రానికి జై లవకుశ అని పేరు పెట్టారు. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాగా ఫస్ట్ లుక్ విడుదలలో తొలుత శ్రీరాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు కనిపించారు. 
 
ఆఖరున రావణాసురుడు కనిపించాడు. జై జై టైటిల్ సాంగ్‌తో ఫస్ట్ లుక్ బ్యాక్ డ్రాప్ ముగిసింది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. విజయదశమికి విడుదల కానున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్వెల్ పనిచేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. చూడండి ఫస్ట్ లుక్...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలదన్నేసిన "బాహుబలి" అవకాశం ఎంత విలువైనదో... ఆ నటీనటులకు ఓ గుణపాఠమా?