Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ముగిసిన రిషి కపూర్ అంత్యక్రియలు

లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ముగిసిన రిషి కపూర్ అంత్యక్రియలు
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:22 IST)
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో రిషి కపూర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబై పోలీసుల ఆంక్షల మధ్య అతి తక్కువ మంది సెలెబ్రిటీల సమక్షంలో ఇవి పూర్తి చేశాయి. ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఈ అంత్యక్రియలను పూర్తిచేశారు. 
 
బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన రిషి కపూర్‌ను ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. అయితే, ముంబై మహానగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఉద్ధృతంగా ఉండటంతో పాటు.. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో రిషి కపూర్‌ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికకు తరలించారు. 
webdunia
చందన్వాడి శ్మశానవాటికలో విద్యుత్ దహనవాటికపై రిషి కపూర్ పార్థివ దేహాన్ని ఉంచి దహనం చేశారు. ఆయన మృతదేహం మధ్యాహ్నం 3.45 గంటలకు దహన మైదానానికి చేరుకోగా, లాక్డౌన్ కారణంగా, ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే అంత్యక్రియలకు హాజరుకావడానికి అనుమతినిచ్చారు. 
 
రిషి కపూర్‌ను చివరిసారి చూసేందుకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన రిషి కుటుంబ సభ్యులు రణబీర్ కపూర్, రాజీవ్ కపూర్, రణధీర్ కపూర్, నీతు కపూర్, రీమా జైన్, మనోజ్ జైన్, అర్మాన్ జైన్, అదర్ జైన్, అనిషా జైన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, బిమల్ పరిఖ్, నటాషా నందన్ డాక్టర్ తరంగ్, అలియా భట్, అయాన్ ముఖర్జీ, జై రామ్, రోహిత్ ధావన్, రాహుల్ రావైల్ పాల్గొన్నారు.
 
అలాగే, అంతకుముందు ముంబై చందన్‌వాడి శ్మశానంలో జరిగిన అంత్యక్రియలకు రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. అంతిమ వీడ్కోలు పలికారు. 
webdunia
ఇకపోతే, రిషి కపూర్ అంత్యక్రియలకు ఆయన కుమార్తె రిద్ధిమా కపూర్ హాజరుకాలేకపోయారు. తండ్రి కడసారి చూపునకు నోచుకోలేకపోయారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిద్ధిమా కపూర్ సహా మొత్తం ఐదుగురు ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే అనుమతి దొరకడం ఆలస్యమైంది. 
 
ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా బయలుదేరాలని తొలుత అనుకున్నారు. సాయంత్రం 5 గంటలలోగా అంత్యక్రియలు ముగించాలన్న పోలీసుల నిబంధననుసరించి ముంబై చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. 14 వందల కిలోమీటర్ల ప్రయాణం సాయంత్రం 5లోగా పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో చివరి క్షణంలో ప్రైవేట్ విమానం ద్వారా ముంబై చేరుకోవాలనుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఆమె నాన్న కడచూపునకు నోచుకోలేకపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు ఆచార్య మూవీలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇదే..!